హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RBI Internship Program: ఆర్‌బీఐలో ఇంట‌ర్న్‌షిప్‌.. నెల‌కు రూ.20,000 స్టైఫండ్‌.. అప్లికేష‌న్ ప్రాసెస్‌!

RBI Internship Program: ఆర్‌బీఐలో ఇంట‌ర్న్‌షిప్‌.. నెల‌కు రూ.20,000 స్టైఫండ్‌.. అప్లికేష‌న్ ప్రాసెస్‌!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

RBI Internship: రిజ‌ర్వ్‌బ్యాంక్ ఉద్యోగార్థుల‌కు మంచి అవ‌కాశం క‌ల్పించింది. ముఖ్యంగా మేనేజ్‌మెంట్, కామర్స్, స్టాటిస్టిక్స్, లా, ఎకనామిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకనామెట్రిక్స్ వంటి కోర్సులు చేసే వారి కోసం ఆర్‌బీఐ కొత్త ప్రొగ్రాం ప్రారంభించింది. అదే స‌మ్మ‌ర్ ఇంట‌ర్న్‌షిప్‌. ఇది విద్యార్థుల‌కు, గ్రాడ్యుయేట్ ఫ్రెష‌ర్ల‌కు ఎంతో ఉప‌యోగం ఉండ‌నుంది. ఈ ఇంట‌ర్న్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

బ్యాంక‌ర్స్ బ్యాంక్‌ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) విద్యార్థుల‌కు స‌ద‌వ‌కాశం అందిస్తోంది. ఆర్‌బీఐలో విద్యార్థుల‌కు, గ్రాడ్యుయేట్ ఫ్రెష‌ర్ల‌కు వార్షిక వేసవి ఇంటర్న్‌షిప్ (Internship) ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఇంట‌ర్న్‌షిప్‌కు ఫైనాన్స్, ఎకనామిక్స్ (Economics), లా, బ్యాంకింగ్‌లలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రొగ్రామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ స‌మ్మర్ ప్లేస్‌మెంట్స్ కోసం మొత్తం 125 మంది ఇంటర్న్‌లను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైఫండ్ అందజేస్తారు. శిక్షణ (Training) పొందినవారు ముంబై (Mubai)కి మరియు తిరిగి వచ్చే ప్రయాణ ఖర్చులను భరించాలి. వారి వసతి ఏర్పాట్లను కూడా వారే స్వయంగా చూసుకోవాలి.

భార‌తీయ విద్యార్థుల‌కు కావాల్సిన అర్హ‌త‌లు

- మేనేజ్‌మెంట్, కామర్స్, స్టాటిస్టిక్స్, లా, ఎకనామిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకనామెట్రిక్స్ లేదా భారతదేశంలోని ప్రముఖ కళాశాలలు, సంస్థల నుంచి న్యాయశాస్త్రంలో మూడేళ్ల పూర్తి-సమయం ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీలో సమగ్ర ఐదేళ్ల లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించి ఉండాలి.

Jobs in Andhra Pradesh: అనంత‌పురం డీఎంహెచ్ఓలో ఉద్యోగాలు.. జీతం రూ. 19,019.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


- విద్యార్థులు వారి చివరి సంవత్సరం/సెమిస్టర్ సమయంలో వేసవి ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవ‌చ్చు.

విదేశి విద్యార్థుల‌కు కావాల్సిన అర్హ‌త‌లు..

- విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల్లో ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, లా (ఐదేళ్ల ప్రోగ్రామ్) చేసి ఉండాలి.

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న వారిలో షార్ట్ లిస్ట్ (Short List) చేసిన అభ్య‌ర్థుల‌కు 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా RBI ఆఫీసులో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

- RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం ఎంపికైన అభ్యర్థుల వివ‌రాలు ఫిబ్రవరి లేదా మార్చి 2022 నెలలో ప్రకటిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 :  ఈ ఇంట‌ర్న్‌షిప్‌కు అర్హ‌త ఉన్న భార‌తీయ‌ విద్యార్థులు ఆన్‌లైన్ వెబ్ ఆధారిత దరఖాస్తు ఫారం నింపాలి.

Jobs in Andhra Pradesh: గుంటూరు జిల్లాలో 61 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు తెలుసుకోండి


Step 3 :  అనంత‌రం సమ్మర్ ప్లేస్‌మెంట్ కోసం తమ సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా “భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ కార్యాలయాలకు” దరఖాస్తు చేసుకోవాలి.

Step 4 : అర్హత కలిగిన విదేశీ విద్యార్థులు, నిర్ణీత ఫారమ్‌లో దరఖాస్తును పూరించాలి.

Step 5 :  చిరునామాకు మెయిల్ చేయాలి -

- అడ్ర‌స్‌

చీఫ్ జనరల్ మేనేజర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ట్రైనింగ్ & డెవలప్‌మెంట్ డివిజన్),

సెంట్రల్ ఆఫీస్,

21వ అంతస్తు,

సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్,

షాహిద్ భగత్ సింగ్ రోడ్,

ముంబై - 400 001

Step 6 :  దరఖాస్తు యొక్క ముందస్తు కాపీని cgminchrmd@rbi.org.in కు ఈ-మెయిల్ చేయవచ్చు.

Step 7 :  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 31, 2021.

First published:

Tags: Internship, JOBS, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు