హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Internship: ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దుతున్నారా.. నెల‌కు రూ.15,000ల స్టైఫండ్‌తో ఇంట‌ర్న్‌షిప్ ఆఫ‌ర్‌!

Internship: ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దుతున్నారా.. నెల‌కు రూ.15,000ల స్టైఫండ్‌తో ఇంట‌ర్న్‌షిప్ ఆఫ‌ర్‌!

ఇంట‌ర్న్‌షిప్‌

ఇంట‌ర్న్‌షిప్‌

Internship-2022 | చివరి సంవత్సరం B.Tech / M.Tech చదువుతున్న విద్యార్థులకు ఇంట‌ర్న్‌షిప్ చాలా ముఖ్యం. ఈ నేప‌థ్యంలో  కేంద్ర రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ హైవేస్ ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.

ఇంకా చదవండి ...

చివరి సంవత్సరం B.Tech / M.Tech చదువుతున్న విద్యార్థులకు ఇంట‌ర్న్‌షిప్ చాలా ముఖ్యం. ఈ నేప‌థ్యంలో  కేంద్ర రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ హైవేస్ ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు( అండర్ గ్రాడ్యుయేట్స్) ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన అంశాలు

- చివరి సంవత్సరం BTech/ MTech చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌.

- నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కు చెందిన కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, ఇతర ఏజెన్సీలతో కలిసి ఈ విద్యార్థులు పనిచేస్తూ వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందే అవకాశం ఉంది.

TS TET-2022: టీఎస్ టెట్‌-2022కి ప్రిపేర్ అవుతున్నారా.. టాపిక్‌ల వారీగా ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలుసుకోండి!

- విద్యార్థులు కనీసం మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు.

- తరువాత మరో 12 వారాల పాటు నిర్దిష్ట హైవే ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్, కన్సల్టెంట్‌కు వీరిని కేటాయిస్తారు.

- ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2022-23 అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభమవుతుంది.

ద‌ర‌ఖాస్తు విధానం..

- ఈ ఇంటర్న్‌షిప్ కోసం తప్పనిసరిగా AICTE వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్న్‌షిప్‌‌కు అర్హత సాధించాలంటే గత సెమిస్టర్లలో 7 లేదా అంత కంటే ఎక్కువ CGPA సాధించి ఉండాలి.

- అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 15, 2022 లోపు సమర్పించాలి.

ఎంపిక అనంత‌రం..

- విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేసిన తరువాత వారిని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేటాయిస్తారు.

- ప్రాజెక్ట్ పనులను చేపట్టే ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్‌లకు రూ.10,000, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు రూ.15,000 నెలవారీ స్టైఫండ్ అందిస్తారు.

- అభ్యర్థులకు వసతి - రవాణా సౌకర్యాలను కూడా ఏజెన్సీయే చూసుకుంటుంది.

- ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్ జారీ చేయనున్నారు.

Telangana Govt Jobs: తెలంగాణలో డిగ్రీ అర్హతతో మరో జాబ్ నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. మెరిట్ ఉంటే ఉద్యోగమే..

సర్టిఫికెట్ ఎలా పొందాలంటే..

విద్యార్థులు ఒక మిడ్-టర్మ్, చివరి-టర్మ్ మూల్యాంకనానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ లెర్నింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌పై విద్యార్థుల ప్రెజెంటేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌పై విద్యార్థులు ఇచ్చే రిపోర్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడర్లు ఇచ్చే జనరల్ అసెస్‌మెంట్‌తో అటెండెన్స్ ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. సర్టిఫికేట్ పొందడానికి అర్హత సాధించాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 75 మార్కులు సాధించాలి.

మరోపక్క ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ఇతర ఇంటర్న్‌షిప్‌లను పరిశీలిద్దాం.

AICTE బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్) ఇంటర్న్‌షిప్ -2022

ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులు 12 నెలల పాటు మెర్రీ గో లెర్న్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది.

అర్హతలు

బిజినెస్ డెవలప్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉండాలి. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కారం, ప్రజెంటేషన్, సంస్థాగత నైపుణ్యాలను కలిగి ఉండాలి. ప్రతిభను బట్టి అభ్యర్థులకు నెలకు రూ. 8,000 రివార్డ్ రూపంలో ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://internship.aicte-india.org/internship-details.php?uid=INTERNSHIP_1650457299625ffad38fa1e సైట్‌ను సంప్రదించాలి.

First published:

Tags: Career and Courses, EDUCATION, Internship

ఉత్తమ కథలు