Internship Alert : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎక్కువ స్కిల్స్ ఉన్నవారికే మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మెరుగైన నైపుణ్యాలు ఉన్నవారికే మంచి కొలువులు దక్కుతున్నాయి. సంబంధిత రంగంలో విద్యార్థి దశలోనే ఎక్స్‌పీరియన్స్ సంపాదించిన వారికి కంపెనీలు జాబ్స్ అందజేస్తున్నాయి. అందుకే విద్యార్థులు ఇంటర్న్‌షిప్(Internships)లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ సర్వీస్ చేస్తూ స్కిల్స్ పెంచుకోవాలనుకునే అభ్యర్థుల కోసం ప్రముఖ NGOలు కొన్ని ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందిస్తున్నాయి. వీటిలో వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home), పార్ట్‌టైమ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tare Zameen
ఈ ఫౌండేషన్ లో పనిచేయాలనుకున్న అభ్యర్థులు ఒక నెలపాటు అందుబాటులో ఉండాలి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం. ఈ NGO అదనపు ఇన్సెంటివ్స్‌తో పాటు నెలకి రూ.1000 స్టైఫండ్(Stipend) అందించనుంది. దీనిపై ఆసక్తి కల అభ్యర్థులు డిసెంబర్ 29లోపు ఇంటర్న్‌శాల వెబ్‌సైట్()లో అప్లై చేసుకోవచ్చు.
Simmi Foundation
సిమ్మి ఫౌండేషన్ లో క్రౌడ్ ఫండింగ్ ప్రోగ్రామ్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంటర్న్‌షిప్ రెండు వారాలపాటు కొనసాగుతుంది. ఈ NGO రూ.200 నుంచి రూ.2000 వరకు స్టైఫండ్ అందించనుంది. డిసెంబర్ 31వ తారీకు లోపు ఇంటర్న్‌శాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Scholarship 50K: విద్యార్థినులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రూ.50వేల స్కాలర్ షిప్ పొందొచ్చు..
PAWZZ
PAWZZ అనేది జంతు సంక్షేమం చూసే NGO. ఇందులో ఒక నెలపాటు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం జరుగుతుంది. తక్షణమే జాయిన్ అయ్యే అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. నెలకు రూ.500- రూ.10000 వరకు స్టైఫండ్ అందిస్తారు. అభ్యర్థి వీలు బట్టి పార్ట్‌టైమ్ కూడా చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30లోపు ఇంటర్న్‌శాలలో అప్లై చేసుకోవాలి.
WWF -India
ఈ ఇంటర్నషిప్ ప్రోగ్రామ్‌కి అప్లై చేసే అభ్యర్థులకు కన్జర్వేషన్ ఇన్ ఇండియన్ బయోడైవెర్సిటీ ప్రాముఖ్యత గురించి అవగాహన ఉండాలి. WWF- Indiaకు ప్రాతినిధ్యం వహిస్తూ సోషల్ సర్కిల్స్‌లో కన్జర్వేషన్‌పై పని చేయాల్సి ఉంటుంది. యూత్ రిప్రజెంటేటివ్‌గా సోర్సెస్ సమీకరణకు కృషి చేయాలి. కన్జర్వేషన్‌కు ఫండ్స్ కలెక్ట్ చేసే నైపుణ్యం ఉండాలి. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఇంగ్లీషు రాయడం, మాట్లాడటంపై పూర్తి పట్టు ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవాళ్లు డిసెంబర్ 27లోపు ఇంటర్న్‌శాల వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Hamari Pehechan
ఢిల్లీ బేస్డ్ NGO హమారీ పెహెచాన్‌లో 3000 మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయి. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు సోషల్ మీడియా క్యాంపెనింగ్, రీసెర్చ్, కంటెంట్ రైటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఇతర అంశాలపై వర్క్ చేయనున్నారు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి NGO ఎటువంటి స్టైఫండ్ అందించడం లేదు. డిసెంబర్ 27లోగా ఇంటర్న్‌శాల వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Internship