హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Internship: డేటా అనలిస్టులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు.. ఈ వారం పరిశీలించాల్సిన లిస్ట్‌ ఇలా..

Internship: డేటా అనలిస్టులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు.. ఈ వారం పరిశీలించాల్సిన లిస్ట్‌ ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం మెరుగైన నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకే.. చక్కటి అవకాశాలు దక్కుతున్నాయి. కంపెనీలు మంచి నైపుణ్యాలు ఉన్న వారికే ఓటేస్తున్నాయి. మంచి కెరీర్ సొంతం చేసుకోవాలంటే.. అవసరమైన స్కిల్స్‌ డెవలప్‌ చేసుకోవడం ప్రధానం. అందుకు ఇంటర్న్‌షిప్‌లు ఉపయోగపడతాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుతం మెరుగైన నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకే.. చక్కటి అవకాశాలు దక్కుతున్నాయి. కంపెనీలు(Companies) మంచి నైపుణ్యాలు ఉన్న వారికే ఓటేస్తున్నాయి. మంచి కెరీర్ సొంతం చేసుకోవాలంటే.. అవసరమైన స్కిల్స్‌ డెవలప్‌(Skill Development) చేసుకోవడం ప్రధానం. అందుకు ఇంటర్న్‌షిప్‌లు అవకాశాలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం డేటా అనలిస్ట్ విభాగంలో కొన్ని కంపెనీలు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అందిస్తున్నాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్(Home) ఆపర్చునిటీస్‌ డీటైల్స్‌ ఇప్పుడు చూద్దాం.

ఫ్యూచర్ స్కిల్(FUTURE SKILL)

ఫ్యూచర్ స్కిల్ కంపెనీ ఆరు నెలల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.4000 స్టైఫండ్ అందిస్తారు. అభ్యర్థులు MS Excelతో పాటు డేటా అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. తగిన నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 29లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కార్తీక్ ధోతీ(KARTHIK DHOTI)

కార్తిక్ ధోతీ సంస్థ డేటా అనలిస్ట్ ఇంటర్న్‌షిప్‌ అవకాశం అందిస్తోంది. ఒక పోస్టుకు మాత్రమే అవకాశం ఉంది. మూడు నెలలపాటు ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థి సంస్థను అలాగే పరిశ్రమను ప్రభావితం చేస్తే స్థానిక, జాతీయ, ప్రపంచ ట్రెండ్‌లను విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం పొందిన వారికి నెలకు రూ.3000 స్టైపెండ్ లభిస్తుంది. ఆసక్తి కల అభ్యర్థులు జనవరి 20లోగా ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

క్లౌడ్ టెక్ మైండ్ సొల్యూషన్స్(CLOUD TECH MIND SOLUTIONS)

క్లౌడ్ టెక్ మైండ్ సొల్యూషన్స్ కంపెనీ కంటెంట్ రైటర్స్, డేటా ఎనలిస్ట్ పోస్టులకు మూడు నెలల ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. ఫిబ్రవరి 9లోపు జాయిన్‌ అయ్యే అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులకు సర్టిఫికెట్‌ల వంటి ప్రోత్సాహాలను అందించడానికి సిద్ధంగా ఉంది. అభ్యర్థులు లింక్‌డిన్ పోర్టల్‌ ద్వారా రెజ్యూమెలను పంపి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓజిబుక్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌(OZIBOOK TECH SOLUTIONS)

బెంగళూరుకు చెందిన టెక్ స్టార్టప్ ఓజిబుక్ టెక్ సొల్యూషన్స్.. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ అవకాశం అందిస్తోంది. నెలకు రూ.1000 స్టైఫండ్‌ను అందిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 17 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Jio True 5G: ఏపీలో విస్తరిస్తున్న జియో ట్రూ 5జీ సేవ‌లు .. తిరుపతి , నెల్లూరు పట్టణాల్లో ప్రారంభం..

జ్రేష్టా ఇన్ఫోట్(ZRESTA INFOTECH )

జ్రేష్టా ఇన్ఫోట్ కంపెనీ ఆసక్తి గల అభ్యర్థులకు ఫుల్ టైం ఆపర్చునిటీ అందిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే ఉన్న సిస్టమ్స్‌ ప్రభావాన్ని, సామర్థ్యాన్ని సమీక్షించి, విశ్లేషించాలి. అలాగే వాటి అభివృద్ధి కోసం ప్లాన్స్‌ డెవలప్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి తప్పనిసరిగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంలో పరిజ్ఞానం ఉండాలి.

First published:

Tags: Analytics, Data science, JOBS

ఉత్తమ కథలు