ఈ డిజిటల్ యుగంలో కంటెంట్ రైటర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. వివిధ కంపెనీల్లో అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్(Internship)లు ఆఫర్ చేస్తున్నాయి. వీటి ద్వారా కంటెంటర్ రైటింగ్ స్కిల్స్ పెరగడమే కాకుండా.. ఇంటర్వ్యూలలో ప్రాధాన్యం ఉంటుంది. బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీలు లభిస్తాయి. ఇంటర్న్‌శాల ద్వారా కంటెంట్ రైటింగ్ ఇంటర్న్‌షిప్ అందిస్తున్న కంపెనీల వివరాల గురించి ఇప్పుడు చూద్దాం.
శిక్షాలయ్ ల్యాబ్స్(Sikshalay Labs)
శిక్షాలయ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన లాజికల్ రీజనింగ్ సెగ్మెంట్లో కంటెంట్ రైటర్స్‌కి మూడు నెలల ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ఇన్సెంటివ్స్ కలిపి రూ.3000 స్టైఫండ్ అందిస్తారు. క్వశ్చన్‌ల ఆధారంగా పేమెంట్ ఉంటుంది. దీనితోపాటు NDA/CDS లెవెల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి. ఆసక్తికర అభ్యర్థులు జనవరి 11 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టడీ వో(Study Woo)
ఈ ఢిల్లీ బేస్డ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ రైటర్స్ కోసం చూస్తోంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం. ఈ ఇంటర్న్‌షిప్ వెంటనే జాయిన్ అయ్యే అభ్యర్థులకి మంచి అవకాశం. రెండు నెలల ఈ ఇంటర్న్‌షిప్ అసిస్టెన్స్‌లో రూ.1000-2000 స్టైఫండ్ అందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 11 లోపు దీనికి ఇంటర్న్‌శాల ద్వారా అప్లై చేసుకోవాలి.
పీపుల్ బ్రిడ్జ్(People Bridge)
నోయిడా ఆధారంగా పనిచేసే ఈ పీపుల్ బ్రిడ్జ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ వర్క్ ఫ్రొమ్ హోమ్ ఆధారిత కంటెంట్ రైటర్స్ కోసం చూస్తోంది. మూడు నెలలపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా రూ.10000 స్టైఫండ్ అందిస్తారు. దీనికి అప్లై చేసుకోవడానికి జనవరి 13 ఆఖరి తేదీ.
నవ్-తరంగ్ సోషల్ ఆర్గనైజేషన్(Nav-Tarang Social Organization)
నవ్ తరంగ్ సోషల్ ఆర్గనైజేషన్ కంటెంట్ క్రియేటర్స్‌కి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. రెండు నెలల పాటు సాగే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకి వెంటనే జాయిన్ అయ్యే అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో వెబ్‌సైట్ కోసం ఇన్ఫో గ్రాఫిక్స్, బ్లాగ్స్, షార్ట్ పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. జనవరి 13 లోపు దీనికి అప్లై చేసుకోవాలి.
RMC ఎడ్యుకేషనల్ సర్వీసెస్
RMC ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇంగ్లీష్ కంటెంట్ రైటర్స్ కోసం అవకాశాలు ఇస్తోంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్. వెంటనే జాయిన్ అయ్యే అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతోంది. మూడు నెలలపాటు జరిగే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో రూ.1500- రూ.3500 స్టైఫండ్ అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 12 లోపు అప్లై చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Internship, JOBS