హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Internships Alert: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. మంచి స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్ అవకాశాలు.. రూ.7.5 లక్షల వరకు!

Internships Alert: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. మంచి స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్ అవకాశాలు.. రూ.7.5 లక్షల వరకు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Internships Alert: కొత్తగా ఉద్యోగాల కోసం చూసేవారికి కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపికైన వారికి మంచి స్టైఫండ్ కూడా అందిస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుత జాబ్ మార్కెట్‌ (Job Market) లో ఫ్రెషర్స్‌కు ఎన్నో రకాల అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల (New Jobs) కోసం చూసేవారికి కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్ (Internship) అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపికైన వారికి మంచి స్టైఫండ్ కూడా అందిస్తున్నాయి. ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ ఆఫర్ అందిస్తున్న సంస్థలను పరిశీలిద్దాం.

* బుక్‌మైషో

టెక్నికల్ రైటర్ కోసం బుక్ మైషో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించింది. అర్హులైన వారు అక్టోబర్ 31 లోపు ఇంటర్న్‌షాలాలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ డయాగ్రామ్, API డాక్యుమెంట్లు, వీక్లీ/మంత్లీ ట్రాకర్స్, ఇంజనీరింగ్ రిపోర్ట్స్ వంటి అప్‌డేట్లపై వీరు పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనం రూ. 3 లక్షలుగా నిర్ణయించారు.

* మాన్‌స్టర్ ఇండియా

యూపీలోని నోయిడాలో ఉన్న మాన్‌స్టర్ ఇండియా సంస్థ బిజినెస్ అనలిస్ట్ కోసం ఫ్రెషర్స్ నుంచి అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా ద్వారా నంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.4 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. కంపెనీ మార్కెటింగ్ వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలో, నియామకాలు చేపట్టడంలో అభ్యర్థులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

* యంగ్ ఎలిగాన్స్ లైఫ్ కేర్‌

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ప్రెషర్స్‌కు కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్న్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా ద్వారా అక్టోబర్ 11లోపు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు కంపెనీ లొకేషన్‌లో పనిచేయాల్సి ఉంటుంది. కస్టమర్స్/క్లయింట్‌లతో లాభదాయకమైన రిలేషన్స్‌‌ను మేనేజ్ చేయాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ. 3 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆయిల్ లో ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో 1535 జాబ్స్.. పూర్తి వివరాలివే..

* Skill-LYNC

స్కిల్ లిన్స్ సంస్థ సేల్స్ స్పెషలిస్ట్ ఇంటర్న్‌షిప్‌‌ ఆఫర్ అందిస్తోంది. ఇందుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.7.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా ద్వారా నవంబర్ 2లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలక్ట్ అయిన వారు చెన్నై, ఢిల్లీ , బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఎక్కడో ఒక చోటు పనిచేయాల్సి ఉంటుంది. న్యూ సేల్స్ అవకాశాలను గుర్తించడం, ఇన్ బౌండ్, అవుట్ బౌండ్ కాల్స్‌ను ఫాలో‌అప్ చేయడం వంటి బాధ్యలు చూసుకోవాలి.

* సెప్టానోవ్ టెక్నాలజీస్‌

యూపీలోని గుర్గావ్‌లో ఉన్న ఈ సంస్థ మేనేజర్ ఆపరేషన్స్ విభాగంలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 6గా నిర్ణయించారు. ఎంపికైన వారు ఆన్‌లైన్ పోర్టల్, వెండర్ మేనేజ్‌మెంట్ వర్క్, అకౌంటింగ్ వంటి మేనేజర్ లెవల్ పనులు చూసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ. 2 లక్షల నుంచి 2.4 లక్షల మధ్య వార్షిక వేతనం అందుకుంటారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, Internship, JOBS

ఉత్తమ కథలు