Internship Alert: కెరీర్లో మంచి అవకాశాలను అందుకోవడానికి ఇంటర్న్‌షిప్‌లు(Internships) సహాయపడతాయి. వీటి ద్వారా సంబంధిత రంగంలో కొంత అనుభవం సాధించవచ్చు. అంతేకాకుండా విద్యార్థి దశలోనే వర్క్ కల్చర్ గురించి అవగాహన పెంచుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ వివరాలు పొందుపరచడంతో రెజ్యూమ్ కూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. రిక్రూటర్ల నుంచి ప్రాధాన్యం లభిస్తుంది. అందుకే చాలా మంది విద్యార్థులు కళాశాలలో చదువుతున్నప్పుడు ఇంటర్న్‌షిప్‌లు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా మార్కెటింగ్(Social media marketing)లో వివిధ ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హంగామా డిజిటల్ మీడియా ఎంటర్ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(HUNGAMA DIGITAL MEDIA ENTERTAINMENT PRIVATE LIMITED)
ఈ ఇంటర్న్‌షిప్‌కు ముంబై నుంచి పనిచేయాలి. డిసెంబర్ 7లోగా ఇంటర్న్శాలాలో అప్లై చేసుకోవచ్చు. 3 నెలలపాటు ఉంటుంది. నెలకు స్టైఫండ్ కింద రూ.5,000 అందజేస్తారు. అభ్యర్థులు కోల్డ్ కాలింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, మార్కెట్ రీసెర్చ్, కాంపిటీషన్ మ్యాపింగ్‌లో పని చేయాల్సి ఉంటుంది.
డై ఇట్ యువర్సెల్ఫ్(DYE IT YOURSELF)
జైపూర్‌లో ఉన్న డై ఇట్ యువర్సెల్ఫ్, 3 నెలల ఇంటర్న్‌షిప్‌కు అభ్యర్థులను రిక్రూట్ చేస్తోంది. నెలకు రూ.7,000 స్టైఫండ్ ఉంటుంది. కొత్త సోషల్ మీడియా స్ట్రాటజీలను డెవలప్ చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రమోషన్ ప్రధాన బాధ్యతలలో ఒకటి. ఇంటర్న్‌శాలా ద్వారా అప్లై చేసుకోవడానికి గడువును డిసెంబర్ 13గా పేర్కొన్నారు.
Renault India: రెనాల్ట్ కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్స్‌పై రూ.50,000 వరకు డిస్కౌంట్..
కొరిజో(CORIZO)
కోరిజో వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానంలో సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం ఇంటర్న్‌లను ఆహ్వానిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్ నెల రోజులు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. ఇంటర్న్‌శాలా ద్వారా డిసెంబర్ 17లోగా దరఖాస్తు చేసుకోవాలి.
టైటాన్ కంపెనీ లిమిటెడ్(TITAN COMPANY LIMITED)
ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 నెలలు. బెంగుళూరులో ఉన్న ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందజేస్తారు. పూణే నగరంలోని సెలబ్రిటీ ఇన్ఫ్లూయెన్సర్లను గుర్తించడం ఇంటర్న్ ప్రాథమిక బాధ్యతలలో ఒకటిగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌శాలా ద్వారా డిసెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలి.
డిజిడేసి - డిజిటల్ మార్కెటింగ్ & డిజైన్(DIGIDESI - DIGITAL MARKETING & DESIGN)
3 నెలలపాటు ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ. 5 వేలు స్టైఫండ్ లభిస్తుంది. దీనికి డిసెంబర్ 14లోగా ఇంటర్న్‌శాలా పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూణేలో ఉన్న ఆఫీస్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ పీరియడ్ పూర్తయిన తర్వాత.. అభ్యర్థులకు రికమండేషన్ లెటర్, ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్‌ను కంపెనీ అందజేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Interships, Social Media