Internshala: కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్న్‌షాలా ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్. రియల్-వరల్డ్ ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించడానికి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (Online Education), ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ (Skill development scholarship program)ను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, డిజైన్ వంటి విభిన్న డొమైన్ లలో 1 లక్ష మందికిపైగా మెరిట్ కాలేజీ విద్యార్థులకు స్కిల్స్ పెంపొందించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని ఇంటర్న్‌షాలా పేర్కొంది. ఇంటర్న్‌షాలా ట్రైనింగ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.1.50 కోట్ల విలువైన 75+ ఇన్-డిమాండ్ స్కిల్స్‌పై విద్యార్థులు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
Osmania University: ఆ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బంపరాఫర్.. వన్ టైం ఛాన్స్
* అర్హత ఏంటి?
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతూ ఉండాలి. అలాగే అభ్యర్థులు తమ బ్యాచ్‌లలో టాప్ టెన్ ర్యాంకర్స్‌లో ఒకరిగా ఉండాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.
* రైట్ స్కిల్స్, గైడెన్స్ ద్వారా..
దేశంలోని వివిధ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో కష్టపడి చదివే ప్రతిభావంతమైన విద్యార్థులు చాలా మంది ఉన్నారని చెప్పారు ఇంటర్న్‌షాలా ట్రైనింగ్స్ హెడ్ షాదాబ్ ఆలం. రైట్ స్కిల్స్, గైడెన్స్ ఇవ్వడం ద్వారా వారు తమ కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఒకపక్క డిగ్రీ చదువు కొనసాగిస్తూనే.. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న స్కిల్‌పై మంచి పట్టుసాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని షాదాబ్ ఆలం తెలిపారు.
Telanagana: తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు.. ఏటా 48 వేల ఉద్యోగాలు ..
* ఫ్రూప్‌గా మార్క్‌షీట్..
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించాలంటే, విద్యార్థులు తమ కాలేజీ ఫ్యాకల్టీ లేదా ట్రైనింగ్స్, ప్లేస్మెంట్ అధికారులను సంప్రదించి, తాము టాప్ 10 ర్యాంకర్స్‌లో ఉన్నట్లు ఎవిడెన్స్‌గా తమ మార్క్షీట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
కాగా, ఇంటర్న్‌షాలా..దేశంలో ఉన్న వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి కూడా యువతకు అవకాశం కల్పిస్తుంది. అలాగే స్కిల్స్ పెంపొందించటానికి ఆన్లైన్ వేదికగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను సైతం ఆఫర్ చేస్తుంది. ఇంటర్న్‌షాలా ఆఫర్ చేసే కోర్సుల కోసం రిజిస్టర్ చేసుకునే విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ కూడా పొందే అవకాశం ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, విద్యార్థులకు ఉద్యోగ ఇంటర్వ్యూలకు సిద్ధం చేయనున్నారు. మాక్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావడానికి ప్రాక్టీస్ మెటీరియల్ సైతం ఇస్తారు. ఇంటర్వ్యూ తర్వాత, విద్యార్థుల పర్ఫార్మెన్స్ మెరుగుపడటానికి అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Scholarships, Student