హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: మహిళలకు వాటిపై శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. స్పెషల్ ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐటీ మద్రాస్‌ ఎంపిక..

IIT Madras: మహిళలకు వాటిపై శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. స్పెషల్ ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐటీ మద్రాస్‌ ఎంపిక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టెమ్ (STEM)లో జాయిన్ అయ్యేలా మహిళలను ప్రోత్సహించడానికి, వారిని స్టెమ్ లో మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ (DST) మొత్తం 30 ఇన్‌స్టిట్యూట్లను సెలెక్ట్ చేసింది. అందులో ఐఐటీ మద్రాస్ ఒకటిగా నిలుస్తోంది.

ఇంకా చదవండి ...

స్టెమ్ (STEM)లో లింగ అసమానత (Gender Disparity) గురించి ఇటీవల కాలంలో చాలా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో లింగ సమానత్వాన్ని (Gender Equality) ప్రోత్సహించడానికి జెండర్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (GATI) అనే ఒక వినూత్న పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ (DST) ఇంట్రడ్యూస్ చేసింది. తాజాగా ఈ ప్రాజెక్టు కింద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (IITM)ని గవర్నమెంట్ ఎంపిక చేసింది. స్టెమ్ (STEM)లో జాయిన్ అయ్యేలా మహిళలను ప్రోత్సహించడానికి, వారిని స్టెమ్ లో మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ (DST) మొత్తం 30 ఇన్‌స్టిట్యూట్లను సెలెక్ట్ చేసింది. అందులో ఐఐటీ మద్రాస్ ఒకటిగా నిలుస్తోంది. 30 పైలట్ సంస్థలలో ఒకటిగా తమ ఇన్‌స్టిట్యూట్ ఎంపిక కావడం గర్వంగా ఉందని ఐఐటీ మద్రాస్ పేర్కొంది.

Russia Ukraine war: పుతిన్‌, జెలెన్‌స్కీకి PM Modi ఫోన్ కాల్.. కీలక సూచన -అలా చేస్తే యుద్ధం ఆగేనా!


డీఎస్టీకి చెందిన GATI లేదా ‘జెండర్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రోగ్రాం’ అనేది పాలసీలను డెవలప్ చేయడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, సమస్యలను క్రమపద్ధతిలో, సమయానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా ప్రభుత్వం ఎంపిక చేసిన ఐఐటీ మద్రాస్‌లో GATI సెల్ఫ్ అసెస్‌మెంట్-టీమ్ (GSAT) ఇప్పటికే ఏర్పాటయింది. ఈ బృందంలో ఇన్‌స్టిట్యూట్‌లోని ప్రతి వాటాదారుల గ్రూపు నుంచి అనేక మంది ప్రతినిధులు ఉన్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్ నాయకత్వం, అడ్మినిస్ట్రేషన్ GATI బృందం రూపొందించిన జెండర్ ఈక్విటీ చార్టర్‌కు కట్టుబడి ఉన్నాయి. అలానే డాక్టర్ జాలీ అభివృద్ధి చేసిన ఫ్రేమ్‌వర్క్‌పై జీఎస్ఏటీ (GSAT) చురుకుగా పని చేస్తోంది.

ఐఐటీ మద్రాస్ ఇమీడియట్ ఫీచర్ ప్లాన్స్ చూసుకుంటే... వివిధ రంగాలకు చెందిన ఉమెన్ లీడర్స్ కథలు చెప్పడం, కెరీర్ అడ్వాన్స్‌మెంట్, సిబ్బందికి నెట్‌వర్కింగ్ వర్క్‌షాప్‌లు, మహిళా రీసెర్చ్ స్కాలర్‌లకు మద్దతు ఇవ్వడం, కమ్యూనిటీ ఔట్‌రీచ్ యాక్టివిటీలు, ఇంటర్నేషనల్ మొబిలిటీ కోసం మహిళా ఫ్యాకల్టీకి ప్రోగ్రామ్‌లు వంటి నైపుణ్యం పెంచే ప్రోగ్రామ్స్ పై సెమినార్ సిరీస్‌లు ఉన్నాయి.

స్టెమ్ లో మహిళల ఎంకరేజ్మెంట్ విషయంలో ఐఐటీ మద్రాస్ నిబద్ధత గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “డీఎస్టీ ప్రోగ్రామ్స్ చాలా ముఖ్యమైనవి... ఇవి ఐఐటీ మద్రాస్ విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. ఐఐటీఎం (IITM) GATI ప్రోగ్రాంకు పూర్తిగా మద్దతు ఇస్తుంది." అని ప్రొఫెసర్ వి.కామకోటి చెప్పుకొచ్చారు.

లింగ నిష్పత్తుల మెరుగుదల పరంగా స్పష్టమైన, పాజిటివ్ చేంజెస్ తీసుకురావడానికి ఉద్దేశించిన GATIని అభివృద్ధి చేయడానికి DST బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లతో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుంది. ఇండియా కోసం ప్రత్యేకంగా జెండర్ ఈక్విటీ చార్టర్ ను కూడా అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని మిరాండా హౌస్‌లోని మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతిభా జాలీ, ఆమె బృందం ఇన్‌స్టిట్యూషన్ జెండర్ క్లైమేట్ ని మూల్యాంకనం చేయడానికి, అంచనా వేయడానికి ఒక పద్దతిని అభివృద్ధి చేశారు. ఇది ప్రత్యేకంగా భారతీయ రూపాన్ని కలిగి ఉంది.

ALSO READ Russsia enemy countries : రష్యా శత్రుదేశాలు ఇవే..లిస్ట్ విడుదల చేసిన పుతిన్

స్టెమ్ లో వృత్తిని చేపట్టేందుకు మహిళలను ప్రోత్సహించడంలో GATI ఇంపాక్ట్ గురించి మాట్లాడారు ఐఐటీ మద్రాస్ GATI సెల్ఫ్ అసెస్‌మెంట్ టీమ్ (GSAT) నోడల్ ఆఫీసర్, ప్రొఫెసర్ ప్రీతి అఘాలయం. “DST ప్రోగ్రాం మాకు సరైన సమయంలో వస్తుంది. ఐఐటీ మద్రాస్ పరిశోధన, లింగ వాతావరణాన్ని మెరుగుపరచడంలో బృందంతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని ప్రీతి అన్నారు.

First published:

Tags: Career and Courses, IIT Madras, Students

ఉత్తమ కథలు