అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ PWC (Price water house Cooper) ఇండియాలో వచ్చే 5 సంవత్సరాల్లో 30వేల మందిని నియమించుకుంటుందని చైర్మన్ పేర్కొన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రపంచానికి నైపుణ్యాలను (స్కిల్) సరఫరా చేసే దేశంగా భారత్(India) మారుంతుందన్నారు. ప్రపంచంలో ఏ ఇతర దేశాల్లో లేని విధంగా టెక్నాలజీ, స్కిల్స్ ను ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ ను వినియోగించుకోవడం భారత్ కు కలిసి వచ్చే అంశం గా పేర్కొన్నాడు. ప్రస్తుతం తమకు 31వేల మంది ఉద్యోగులున్నారని.. రాబోయో సంవత్సంరంలో మరో 30వేల మంది అవసరం అవుతారాని.. వారిని భారత్ నుంచి నియమించుకునే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే.. ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్ కంపెనీ మాత్రం భారీగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లలో 30 వేల ఖాళీలు భర్తీ చేయడానికి ఈ కన్సల్టెన్సీ సంస్థ సిద్ధమైంది. దేశంలో కంపెనీ సేవలను విస్తృతపరచడంలో భాగంగా ఉద్యోగాల భర్తీ అనివార్యం కానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తద్వారా భారత్‌లో కంపెనీ శ్రామిక సిబ్బంది పెరగనుంది. ప్రస్తుతం దేశంలో కంపెనీలో మొత్తంగా 50వేల మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ శ్రామిక సిబ్బందిని 80వేలకు చేర్చాలన్నది కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
PwC ఇండియా, PwC అమెరికా సంస్థలు సంయుక్తంగా భారత్‌లో కార్యచరణను చేపట్టనున్నాయి. గ్లోబల్ సెంటర్లను భారత్‌లో నెలకొల్పేందుకు జాయింట్ వెంచర్‌లో భాగమయ్యాయి. కంపెనీని విస్తరించడం, నాణ్యతను మెరుగుపరచడం, వృద్ధి సాధించడం, క్లైంట్ సంబంధాలను విస్తృతపరచడమే లక్ష్యంగా ఈ జాయింట్ వెంచర్ కొనసాగనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో భౌగోళికంగా విస్తరించడానికి చాలా ఏళ్ల నుంచి PwC ఇండియా కృషి చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది భారత్‌లో నోయిడా, భువనేశ్వర్, జైపుర్‌లలో PwC ఇండియా ఆఫీసులను ప్రారంభించడం ఇందుకు నిదర్శనం.
ఇటీవల దేశంలో కంపెనీ సేవలను విస్తృతపరచడం వెనుక ఉన్న లక్ష్యాల గురించి భారత్‌లో PwC ఇండియా ఛైర్‌పర్సన్ సంజీవ్ కృషణ్ వెల్లడించారు. భారత అభివృద్ధి చరిత్రలో తమ కంపెనీ ఫలప్రదమైన పాత్రను పోషించాలని ఉవ్విల్లూరుతున్నట్లు PwC ఇండియా ఛైర్‌పర్సన్ సంజీవ్ కృషణ్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సంజీవ్ తెలిపారు. ఇందులో భాగంగా PwC అమెరికాతో జత కట్టినట్లు చెప్పారు. ‘మా జాయింట్ వెంచర్ భారత అభివృద్ధి సోపానంలో పాలుపంచుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసింది’ అని సంజీవ్ తెలిపారు. రానున్న కాలంలో భారత్‌లో భౌగోళికంగా విస్తరించడానికి మరిన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు సంజీవ్ కృషణ్ వెల్లడించారు.
PwC అమెరికా కూడా PwC ఇండియాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఇందుకోసమే జాయింట్ వెంచర్‌లో భాగమైనట్లు తెలుస్తోంది. దీనిపై PwC అమెరికా ఛైర్‌పర్సన్, సీనియర్ పార్ట్‌నర్ టిమ్ ర్యాన్ స్పష్టతనిచ్చారు. PwC ఇండియా సహకారంతో పనిచేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో క్లైంట్‌లకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని టిమ్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Private Jobs