news18-telugu
Updated: June 22, 2020, 2:43 PM IST
Govt Jobs: ఇంటర్ పాసయ్యారా? ఈ 669 ఉద్యోగాలకు అప్లై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ తర్వాత డిగ్రీ లేదా ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేయొచ్చు. ఇంటర్ పాసయ్యాక ఉద్యోగాలు చేయాలనుకునేవారూ ఉంటారు. ఇంటర్ పాసైనవారి కోసం ప్రస్తుతం 2 జాబ్ నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 2 నోటిఫికేషన్ ద్వారా 413 పోస్టులు, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2020 నోటిఫికేషన్ ద్వారా 256 పోస్టుల భర్తీ జరగనుంది. మొత్తం 669 పోస్టులున్నాయి. ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
ఎన్డీఏ ఎన్ఏ 2 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి 2020 జూలై 6 చివరి తేదీ. 10+2 ప్యాటర్న్‌లో 12వ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేయొచ్చు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్పనిసరి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2020 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి జూలై 14 చివరి తేదీ. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవే కాకుండా ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, ఐబీపీఎస్ వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంటుంది. భారతీయ రైల్వేలో కూడా ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జాబ్ నోటిఫికేషన్ల కోసం అధికారిక వెబ్సైట్లు ఫాలో అవుతూ ఉండాలి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Govt Jobs: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి
Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువుPowergrid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 119 జాబ్స్... ఖాళీల వివరాలివే
First published:
June 22, 2020, 2:43 PM IST