Inter Jobs: ఇంటర్ పాసైతే ఈ 7 జాబ్ నోటిఫికేషన్లు మీ కోసమే

Inter Jobs: ఇంటర్ పాసైతే ఈ 7 జాబ్ నోటిఫికేషన్లు మీ కోసమే (ప్రతీకాత్మక చిత్రం)

Intermediate Jobs | దరఖాస్తు చేయడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకొని మీ అర్హతలకు తగ్గ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

  • Share this:
    మీరు ఇంటర్మీడియట్ పాసయ్యారా? మంచి ఉద్యోగం సంపాదించడానికి ఇది సరైన అవకాశం. ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. వేర్వేరు నోటిఫికేషన్లలో వేల సంఖ్యలో ఖాళీలున్నాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, భారతీయ రైల్వేతో పాటు మరిన్ని జాబ్ నోటిఫికేషన్లున్నాయి. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకొని మీ అర్హతలకు తగ్గ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. మరి ఆ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.

    1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 16,208 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటిలో చాలా పోస్టులకు ఇంటర్ అర్హత. దరఖాస్తుకు జనవరి 31 లాస్ట్ డేట్. http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    2. ఇంటర్ పాసైనవారికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశాలున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డిలో 2020 జనవరి 16 నుంచి జనవరి 21 వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. పెళ్లికాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాసైనవారు రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరు కావచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    3. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీ కోసం 'యూపీఎస్‌సీ ఎన్‌డీఏ ఎన్ఏ 1 2020' నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలో చేరాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. మొత్తం 418 పోస్టులున్నాయి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌తో ఇంటర్మీడియట్ లేదా 10+2 పాసైనవారు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    4. ఇంటర్ పాసైనవారు ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్-జనరల్ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 260 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 26న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    5. నార్త్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 21 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    6. పశ్చిమ రైల్వే 14 ఖాళీలను భర్తీ చేస్తోంది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఖాళీలివి. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



    7. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడ్స్ 01/2021 బ్యాచ్ ఎయిర్‌మెన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. గ్రూప్ వై ట్రేడ్‌కు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ కావాలి. గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్‌కు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ 50% మార్కులతో పాస్ కావాలి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



    కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7870 క్లర్క్ జాబ్స్... ఎగ్జామ్ సిలబస్ ఇదే

    EPFO Jobs: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 421 ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్

    Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు 8 నోటిఫికేషన్లు... 8,612 పోస్టులు
    Published by:Santhosh Kumar S
    First published: