ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ రేపటి నుంచే..

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరీక్షా పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6న ప్రారంభిస్తారని అనుకున్నా, లెక్చరర్లు ముందుకు రాకపోవడం సమస్యగా మారింది

news18-telugu
Updated: May 11, 2020, 8:25 AM IST
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ రేపటి నుంచే..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరీక్షా పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6న ప్రారంభిస్తారని అనుకున్నా, లెక్చరర్లు ముందుకు రాకపోవడం సమస్యగా మారింది. అయితే, రేపటి నుంచి వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. పరీక్షలకు దాదాపు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. పరీక్షలు జరుగుతుండగానే కొన్ని సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభించారు. లాక్‌డౌన్ ప్రభావంతో వాల్యుయేషన్ వాయిదా పడింది. తాజాగా, జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షల తేదీల ప్రకటన రావడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 65 లక్షల వరకు జవాబు పత్రాలు ఉండగా, 55 లక్షల పేపర్లు దిద్దాల్సి ఉంది.

వాల్యుయేషన్ కోసం ఇప్పటికే పాతవి 12 స్పాట్ కేంద్రాలతో పాటు కొత్తగా మరో 21 సెంటర్లను ఏర్పాటు చేశారు. సెంటర్‌లోని ఒక్కో రూమ్‌లో 8 నుంచి 12 మంది వాల్యుయేషన్ చేసేలా చూస్తున్నారు. రోజుకు 45 పేపర్లు దిద్దించాలని ఇప్పటికే ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. అందుకు 15 వేల మంది లెక్చరర్లను వాడుకోవాలని భావిస్తోంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 11, 2020, 8:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading