ఇంటర్ వాల్యుయేషన్‌ నేటి నుంచే.. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్..

నేటి నుంచే(మే 6వ తేదీ) వాల్యుయేషన్ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ, మూల్యాంకనం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

news18-telugu
Updated: May 6, 2020, 6:38 AM IST
ఇంటర్ వాల్యుయేషన్‌ నేటి నుంచే.. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు పూర్తయిన రెండు, మూడు రోజులకే రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రారంభమైంది. అప్పటికే ఫస్ట్ లాంగ్వేజీ, సెకండ్ లాంగ్వేజీ పేపర్ల వాల్యుయేషన్ కూడా పూర్తి చేసుకునే దశకు చేరుకుంది. కానీ, కరోనా దెబ్బకు వాల్యుయేషన్ ఆగిపోయింది. ఎక్కడి పేపర్లు అక్కడే పడి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన నేపథ్యంలో వాల్యుయేషన్ జోలికి పోలేదు ఇంటర్ బోర్డు. అయితే, కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో మూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నేటి నుంచే(మే 6వ తేదీ) వాల్యుయేషన్ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ, మూల్యాంకనం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

అటు.. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ నెలలోనే పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఎనిమిది పరీక్షలు పెండింగ్‌లో ఉన్నాయన్న కేసీఆర్... వాటిని నిర్వహిస్తామని అన్నారు. పరీక్ష కేంద్రాలను మరింతగా పెంచడం, వాటిని శానిటైజ్ చేయడం, విద్యార్థులకు మాస్కులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. పరీక్షా సెంటర్లకు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ తెలిపారు.
First published: May 6, 2020, 6:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading