INTERESTED IN MACHINE LEARNING AND ARTIFICIAL INTELLIGENCE COURSES THESE INTERNSHIPS ARE FOR YOU GH VB
Internships: మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులపై ఆసక్తి ఉందా..? అయితే ఇది మీకోసమే..
ప్రతీకాత్మక చిత్రం
మెషిన్ లెర్నింగ్ (ML), కృత్రిమ మేధస్సు (AI) తదితర నిర్దిష్ట రంగాల్లో కెరీర్ కొనసాగించాలనుకునే వారి కోసం కొన్ని ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.
ఇష్టమైన రంగంలో మీకు మంచి అనుభవం ఉంటే ఉద్యోగం(Job) ఈజీగా లభిస్తుంది. అయితే వర్క్ ఎక్స్పీరియన్స్(Experience) కోసం ఇంటర్న్‌షిప్(Internship) ప్రోగ్రామ్‌లు(Programmes) ఉపయోగపడతాయి. పని అనుభవంతో పాటు నెల చివరి కల్లా కొంత మొత్తం లభిస్తుంది. మెషిన్ లెర్నింగ్ (ML), కృత్రిమ మేధస్సు (AI) తదితర నిర్దిష్ట రంగాల్లో కెరీర్(Career) కొనసాగించాలనుకునే వారి కోసం కొన్ని ఇంటర్న్‌షిప్(Internships) అవకాశాలు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.
* ఐఐటీ IIT గౌహతిలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వర్క్ ఫ్రం హోం మోడల్లో మూడు నెలల పాటు జరగనుంది. నెలకు రూ.2000 ఇన్సెంటివ్స్ తోపాటు పనితీరు ఆధారితంగా ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 27లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* కళ్యాణి టెక్నాలజీస్‌లో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్
ఈ ఇంటర్న్‌షిప్ ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12వేల స్టైఫండ్ లభిస్తుంది. అభ్యర్థులు పూణేలో పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 28గా నిర్ణయించారు.
* ఆర్బిట్ బిల్డ్ & క్లీన్ ఇండియాలో..
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆర్బిట్ బిల్డ్ & క్లీన్ ఇండియా చేపట్టనుంది. రెండు నెలల పాటు జరిగే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులకు ఇంటి నుంచి పని చేయవచ్చు. నెలాఖరులో రూ.6000 నుంచి రూ.8000 వరకు స్టైఫండ్ కూడా లభిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 27 చివరి తేదీగా ప్రకటించారు.
* స్కిల్బిట్లో..
మెషిన్ లెర్నింగ్‌లో ఒక నెల ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది స్కిల్బిట్. చేసే పనిని ఇష్టపడితే ఇటర్న్లకు పుల్ టైం ఉద్యోగ ఆఫర్‌ను కూడా పొడిగించే అవకాశం ఉంది. ఇంటర్న్‌షిప్ కాలానికి కంపెనీ రూ.15,000 మొత్తాన్ని చెల్లిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు మే 28 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
* బైలేటరల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో..
మెషిన్ లెర్నింగ్‌పై ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులు మనాలి వంటి ప్రదేశంలో పని చేయాల్సి ఉంటుంది. బైలేటరల్ సొల్యూషన్స్ రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య స్టైఫండ్‌ను అభ్యర్థులకు ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 27 చివరి తేదీగా బైలేటరల్ సొల్యూషన్స్ ప్రకటించింది.
పినాకిల్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్‌లో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం పినాకిల్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు తిరువనంతపురం నుండి పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.6000 స్టైఫండ్‌ను అందిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు మే 28లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పార్క్జాప్ ల్యాబ్స్‌లో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డీప్ లెర్నింగ్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్ కోసం పార్క్ జాప్ ల్యాబ్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు మే 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 నుండి రూ.20,000 మధ్య స్టైఫండ్ లభిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.