ఇంటర్ యూనివర్సిటీ (Inter University) సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (IUCTE)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను(Notification) రిలీజ్ చేశారు. ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు కొరకు అధికారిక సైట్ www.iucte.ac.in ను సందర్శించి ఫారమ్ ను సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత దానిని డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ పత్రాన్ని సెప్టెంబర్ 8, 2022 వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. అర్హత, ఎంపిక, దరఖాస్తు విధానాలను ఇక్కడ తెలుసుకుందాం.
కేటగిరీల వారీగా పోస్టులు..
కేటగిరీ పోస్టులు | పోస్టుల సంఖ్య |
గ్రూప్ ఏ పోస్టులు | 08 |
గ్రూప్ బి పోస్టులు | 07 |
గ్రూప్ సి పోస్టులు | 20 |
దరఖాస్తు రుసుము..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. గ్రూప్ 'ఎ' కింద జనరల్ మరియు ఓబిసి కేటగిరీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 ఫీజును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే జనరల్ అండ్ OBC కేటగిరీ అభ్యర్థులు గ్రూప్ 'B' మరియు 'C' నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 500 రుసుము చెల్లించాలి.
అర్హత..
పోస్టును బట్టి అభ్యర్థులు డిగ్రీ, పీజీ, లైబ్రరీ కోర్సులు చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీని బట్టి గరిష్ట వయోపరిమితిలో వేరుగా ఉన్నాయి. పూర్తి సమాచారం కొరకు నోటిఫికేషన్ ను తనిఖీ చేయవచ్చు.
దరఖాస్తు ఇలా..
Step 1: ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.iucte.ac.inని సందర్శించండి
Step 2: ఆ తర్వాత దరఖాస్తుదారు హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
Step 3: తదుపరి అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను తగిన వివరాలతో నమోదు చేసుకోవాలి.
Step 4: ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
Step 5: ఆ తర్వాత అభ్యర్థి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయి.. వివరాలను నమోదు చేయాలి.
Step 6: చివరగా.. అభ్యర్థులు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
దరఖాస్తు ఫారమ్ ను ఇలా పంపండి..
అభ్యర్థులు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (IUCTE), సుందర్ బాగియా, నారియా - BLW రోడ్, BHU, వారణాసి-221005, U.P. అడ్రస్ కు పంపించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, JOBS, Uttarapradesh