ఎందుకిలా చేశారు.. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. : కేటీఆర్‌కి స్టూడెంట్ ట్వీట్

Inter Results | ఇంటర్ బోర్డు తప్పిదాలు రోజుకోకటి బయటపడుతున్న తరుణంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అయినట్లుగా ఓ స్టూడెంట్ మార్క్ షీట్‌లో ఉంది. దీంతో.. ఆమె కేటీఆర్‌కి ట్వీట్ చేసింది.

news18-telugu
Updated: April 24, 2019, 9:50 AM IST
ఎందుకిలా చేశారు.. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. : కేటీఆర్‌కి స్టూడెంట్ ట్వీట్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 9:50 AM IST
ఇంటర్ పరీక్షలు, ఫలితాలపై రోజుకో దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలోనే మరో విద్యార్థిని కేటీఆర్‌కి ట్వీట్ చేసింది. సైఫాబాద్‌లోని వైదేహి ఆశ్రమంలో ఉంటున్న దివ్యాంగురాలైన భారతి.. వేగేశ్న ఫౌండేషన్ విద్యా సంస్థల్లో కష్టపడి చదువుకుంటోంది. భారతి మొన్న ఇంటర్ ఎగ్జామ్స్ రాసింది. అన్నీ పరీక్షల్లోనూ పాసై ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని శ్రీలక్ష్మి నృసింహ ఒకేషనల్ బాలికల కాలేజ్ నిర్వాహకురాలు మంత్రి కేటీఆర్‌కి వివరిస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

భారతి కుటుంబం 2007-08లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. అదే ఘటనల్లో భారతి దివ్యాంగురాలిగా బయటపడింది. అప్పట్నుంచి ఆశ్రమంలోనే ఉంటూ చదవుకుంటోంది. ఇంత కష్టపడి చదువుతున్న తనకి ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల మార్క్ షీట్‘ఏఎఫ్’ అన వచ్చింది. దీనిపై అధికారులకు కంప్లైంట్ చేసిన ప్రయోజనం జరగలేదు. మళ్లీ ప్రాక్టికల్స్‌కి హాజరుకావాలని సూచించారు. దీంతో ఏం చేయాలో తెలియక మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేసింది భారతి.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...