TS Inter Results : ఈ నెల 18 న ఇంటర్ రిజల్ట్స్.. అధికారికంగా వెల్లడి..

TS Inter Results | ఎట్టకేలకు తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. అనేక కథనాల అనంతరం ఈ నెల 18న ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

news18-telugu
Updated: April 17, 2019, 9:49 PM IST
TS Inter Results : ఈ నెల 18 న ఇంటర్ రిజల్ట్స్.. అధికారికంగా వెల్లడి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నో సందిగ్ధాల అనంతరం ఇంటర్ బోర్డు స్పందించింది. ఈ నెల 18న ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. వీటన్నింటిని ఖండించిన అధికారులు త్వరలోనే రిజల్ట్స్ రిలీజ్ చేస్తామంటూ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 18న నాంపల్లి విద్యాభవన్‌లో ఫలితాలు ప్రకటిస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటికే ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. దీంతో తెలంగాణ ఫలితాలు ఎప్పుడంటూ అంతటా ఒకటే గందరగోళం నెలకొంది. కొన్ని మీడియా సంస్థల్లో జవాబు పత్రాలు మిస్ అయ్యాయంటూ కూడా వార్తలొచ్చాయి. వీటిని ఖండించిన అధికారులు తాజాగా ఏప్రిల్ 18న ఫలితాలు విడుదల చేస్తామంటూ అధికారిక ప్రకటన చేశారు.
తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షలుకొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1300 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు దాదాపు 10లక్షల మంది హాజర్యారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,52,550 మంది కాగా, ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,90,169మంది ఉన్నారు.




<link rel="stylesheet" href="https://static.hindi.news18.com/ibnkhabar/uploads/assests/css/board_result.css" />

<iframe id="board_result" src="https://hindi.news18.com/news/education/board-results/result.html?bid=8&external_loc=https://telugu.news18.com" width="100%" height="350px;"></iframe>

 

న్యూస్ 18  తెలుగులో ఇంటర్ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ నెల 18న విడుదల కానున్నాయి. ఫలితాల కోసం న్యూస్ 18 తెలుగుని ఫాలో అవ్వండి.
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు