Inter Results: ఇంటర్ ఫెయిల్ అయ్యారా? ఇంకో అవకాశం ఉంటుంది

Inter Results | ఇంటర్ ఫెయిల్ అయ్యారని తెలిస్తే ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు ఎంత తేడా మార్కులతో ఫెయిల్ అయ్యారో ముందుగా చూసుకోవాలి.

news18-telugu
Updated: April 16, 2019, 9:05 AM IST
Inter Results: ఇంటర్ ఫెయిల్ అయ్యారా? ఇంకో అవకాశం ఉంటుంది
Inter Results: ఇంటర్ ఫెయిల్ అయ్యారా? ఇంకో అవకాశం ఉంటుంది (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 16, 2019, 9:05 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు గతవారం విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో 60 శాతం, సెకండియర్‌లో 72 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఇక తెలంగాణలోనూ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రానా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటర్ ఫెయిల్ కాగానే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు విద్యార్థులు. జీవితం ఇంటర్ దగ్గరే ఆగిపోదు. ఆగిపోకూడదు. ఇంటర్ ఫెయిలైనంత మాత్రానా జీవితం ముగిసిపోయినట్టు కాదు. జీవితమంటే ఈ ఒక్క పరీక్షనే కాదు. ఇంటర్ ఫెయిల్ అయ్యారని తెలిస్తే ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు ఎంత తేడా మార్కులతో ఫెయిల్ అయ్యారో ముందుగా చూసుకోవాలి. మార్కులు ఎంత తేడా ఉన్నా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చు. విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తోంది ఇంటర్ బోర్డు.

Read this: After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

Inter Results, Telangana inter results 2019, AP inter results 2019, Inter Re counting, Inter Re verification process, Inter supplementary examination, Inter career, ఇంటర్ ఫలితాలు, తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఏపీ ఇంటర్ ఫలితాలు, ఇంటర్ రీకౌంటింగ్, ఇంటర్ రీవెరిఫికేషన్, ఇంటర్ సప్లిమమెంటరీ పరీక్షలు, ఇంటర్ కెరీర్
ప్రతీకాత్మక చిత్రం


ఇంటర్ ఫెయిల్ అయినంతమాత్రానా పై చదువులకు ఇబ్బంది కలుగుతుందని, ఒక ఏడాది వృథా అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించొచ్చు. ఒకవేళ అందులో మార్కులు తేడా ఉంటే పాసయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇంటర్ బోర్డ్. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తర్వాత కూడా ఫెయిల్ అయినట్టు తేలితే వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ఎంసెట్, నీట్ లాంటి పరీక్షలకు ఇబ్బంది కలగకుండా మీరు నెలరోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ కావచ్చు.



Read this: ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్

Inter Results, Telangana inter results 2019, AP inter results 2019, Inter Re counting, Inter Re verification process, Inter supplementary examination, Inter career, ఇంటర్ ఫలితాలు, తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఏపీ ఇంటర్ ఫలితాలు, ఇంటర్ రీకౌంటింగ్, ఇంటర్ రీవెరిఫికేషన్, ఇంటర్ సప్లిమమెంటరీ పరీక్షలు, ఇంటర్ కెరీర్
ప్రతీకాత్మక చిత్రం


ఇంటర్ ఫెయిల్ కాగానే ఏదో ప్రపంచం మునిగిపోయినట్టో, జీవితంలో ఏదో కోల్పోయినట్టో ఆత్మహత్య చేసుకోవడం సరికాదు. జీవితంలో గెలుపోటములు సహజం. ఓటమిని తట్టుకొని పోరాడితేనే విజయం వరిస్తుంది. ఒక్క పరీక్ష మీ జీవితాన్ని, మీ లక్ష్యాలను నిర్దేశించదు. కాబట్టి ఇంటర్‌లో ఫెయిల్ అయితే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరిన్ని అవకాశాలు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి.
Loading...
Photos: ఇస్తాంబుల్‌లో రూ.83,000 కోట్ల ఎయిర్‌పోర్ట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Inter: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... ఇలా చేయాలి

SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

JIO DND Feature: జియో యాప్‌లో డీఎన్‌డీ ఫీచర్ ఇలా యాక్టివేట్ చేయాలి
First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626