Inter Results 2019: రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు ఇలా దరఖాస్తు చేయండి

Inter Re-counting | రీకౌంటింగ్ చేయించాలంటే ఒక్కో పేపర్‌కు రూ.260 ఫీజు చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,300 చెల్లించాలి. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 22 చివరి తేదీ.

news18-telugu
Updated: April 17, 2019, 3:08 PM IST
Inter Results 2019: రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు ఇలా దరఖాస్తు చేయండి
Inter Results 2019: రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు ఇలా దరఖాస్తు చేయండి
news18-telugu
Updated: April 17, 2019, 3:08 PM IST
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తమ జవాబు పత్రాలను రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయించడానికి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(BIEAP) అవకాశం కల్పిస్తోంది. ఇంటర్ సెకండియర్‌లో 72 శాతం, ఇంటర్ ఫస్టియర్‌లో 60 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌ చేయించుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ప్రారంభించింది. రీకౌంటింగ్ చేయించాలంటే ఒక్కో పేపర్‌కు రూ.260 ఫీజు చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,300 చెల్లించాలి. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 22 చివరి తేదీ. ఇంటర్ జవాబుపత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Read this: After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

Inter Results 2019, inter Re-counting, inter re-valuation, inter re verification, bieap.gov.in, BIEAP, Telangana inter results, ap inter results, ఇంటర్ ఫలితాలు, ఇంటర్ రీకౌంటింగ్, ఇంటర్ రీవాల్యుయేషన్, ఇంటర్ రీవెరిఫికేషన్, ఇంటర్ బోర్డ్, ఏపీ ఇంటర్ రిజల్ట్స్, తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, తెలంగాణ ఇంటర్ ఫలితాలు
image: apbie


ముందుగా BIEAP అధికారిక వెబ్‌సైట్ bieap.gov.in లేదా https://apbie.apcfss.in/studentServices.do ఓపెన్ చేయండి.


హోమ్ పేజీలోనే మీకు రీ-వెరిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది.
మార్కులు రీకౌంటింగ్ చేయించాలంటే "Recounting of Marks" పైన క్లిక్ చేయాలి.
మీ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ ఐడీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయాలి.
పేపర్ రీవాల్యుయేషన్ చేయించాలంటే "Reverification of valued answered Scripts" పైన క్లిక్ చేయాలి.
మీ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ ఐడీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయాలి.
రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు, పేమెంట్ చేసే ముందు వివరాలన్నీ సరిచూసుకోవడం మంచిది.
ఒక్కసారి ఫీజు చెల్లించిన తర్వాత రీఫండ్ రాదు.
ట్రాన్సాక్షన్ పూర్తి చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ ప్రింట్ తీసుకోవాలి.
ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ గుర్తుంచుకోవాలి.
Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్

Inter: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... ఇలా చేయాలి

Inter Results: ఇంటర్ ఫెయిల్ అయ్యారా? ఇంకో అవకాశం ఉంటుంది
First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...