Andhra Pradesh: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే.. స్పష్టత ఇచ్చిన మంత్రి

జులైలో ఏపీ ఇంటర్ పరీక్షలు

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఫిక్సైందా..? ఏపీ సీఎం జగన్ తో చర్చించిన తరువాత పరీక్షల తేదీని ప్రకటిస్తారా..? పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందే షెడ్యూల్ ప్రకటిస్తారా..? ఇంతకీ మంత్రి ఏమన్నారు..

  • Share this:
    ఏపీలో ఇంటర్, పది పరీక్షలు జరుగుతాయా..? రద్దవుతాయా..? ఈ అనుమానాలకు క్లారిటీ వచ్చింది. అసలు పరీక్షలు ఉంటాయో ఉండవో తెలియక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అనుమానాలకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెరదించారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామన్నారు. ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. అలాగే జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. తేదీలను కూడా అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నామని.. విద్యాశాఖ అధికారులు సైతం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఉపాధ్యాయులతో కూడా చచ్చించడం జరిగిందన్నారు. అయితే సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల తేదీ, ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

    ప్రస్తుతం ఏపీలో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది అన్నారు. సిబ్బంది సైతం అంతా సిద్ధంగానే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి సురేశ్‌ తెలిపారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే... కరోనా సవాళ్ల మధ్య కూడా పరీక్షలు నిర్వహస్తున్నామని వివరణ ఇచ్చారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

    ఇదీ చదవండి: ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు

    ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే తాజా హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీలో పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. కానీ ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. వచ్చే నెల ఇంటర్‌ పరీక్షలు పూర్తయితే ఆగస్టులో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు ఉంటాయి. సెప్టెంబరులో తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది.

    ఇదీ చదవండి: విశాఖ నుంచి పాలనకు డేట్ ఫిక్స్.. సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడే.. రాజమార్గం ఇలా

    అధికారికంగా పరీక్షల తేదీ ప్రకటించేంత వరకు విద్యార్థులకు మాత్రం ఉత్కంఠ తప్పదు.. ఎందుకంటే థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియడం లేదు. అయితే  ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేశారు. కరోనా భయపెడుతున్న వేళ అన్ని ప్రభుత్వాలు ఆ దిశగానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉన్నా.. విపక్షాలు.. విద్యార్థి సంఘాలు మాత్రం పరీక్షల నిర్వహణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కరోనా టైంలో విద్యార్థుల జీవితాలతో ఆట్లాడడం మంచిది కాదని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. పరీక్షలు రద్దు చేయమని న్యాయ పోరాటం కూడా జరుగుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించే తీరుతాము అంటోంది.
    Published by:Nagesh Paina
    First published: