Home /News /jobs /

INTER EXAMS SPECIAL TS INTER 2ND YEAR ZOOLOGY MODEL PAPER DOWNLOAD MBNR EVK

TS Inter 2nd Year Zoology Model Paper-1: తెలంగాణ‌ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ జువాల‌జీ మోడల్ పేప‌ర్‌.. డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Inter 2nd Year Zoology Model Paper-1 | తెలంగాణ బైపీసీ విద్యార్థుల‌కు కొద్దిగా ఎక్కువ స్కోర్ చాన్స్ చేసే అవ‌కాశం జువాలజీ నుంచి ఉంటుంది. జువాలజీలో మంచి స్కోర్ సాధించాలని క‌ష్ట‌ప‌డుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం ప‌రీక్ష‌లో వ‌చ్చే సెల‌బ‌స్‌, పరీక్ష‌లో ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలిపేలా న్యూస్ 18 ప్ర‌త్యేక మోడ‌ల్ పేప‌ర్ అందిస్తోంది.

ఇంకా చదవండి ...
    సేక‌ర‌ణ: సయ్యద్ రఫీయుద్దీన్, న్యూస్ 18, మహబూబ్ నగర్
    ర‌చ‌యిత: న‌రేంద‌ర్‌, జువాల‌జీ జేఎల్‌, టీఎంఆర్ఐఈఎస్‌, నాగ‌క‌ర్నూల్‌

    కోవిడ్ కారణంగా ఇంటర్ రెండో సంవత్సరం జంతుశాస్త్రం లో ఎక్కువ ఛాయిస్ ఇచ్చి ప్రశ్నలకు సమాధానం రాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో భాగంగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్  జంతుశాస్త్రం ప్రశ్నపత్రం మోడల్ పేపర్  ఏ విధంగా ఉంటుందో చూద్దాం..

    మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం (హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ-1)(HUMAN ANATOMY AND PHYSIOLOGY-1) లో రెండు సబ్ యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1ఏ గా జీర్ణక్రియ, శోషణం (డైజెస్టన్ అండ్ అబ్జార్ప్షన్) (DIGESTION AND ABSORPTION,

    యూనిట్ 1బీ గా శ్వాసించడం, వాయువుల వినిమయం (బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ (BREATING AND EXCHANGE OF GASES) అనే చాప్టర్స్ ఉన్నాయి.

    యూనిట్ 2ఏ గా శరీర ద్రవాలు, ప్రసరణ (బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్)(BODY FLUIDS AND CIRCULATION), యూనిట్ 2బీగా విసర్జక పదార్ధాలు, వాటి విసర్జన (ఎక్సెర్టరీ ప్రోడక్ట్స్ అండ్ దెయిర్ ఎలిమినేషన్) (EXCERTORY PRODUCTS AND THEIR ELIMINATION) ఉన్నాయి.

    యూనిట్ 3ఏ గా కండర-అస్థిపంజర వ్యవస్ధ (మాస్కులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్) (MUSCULAR AND SKELETAL SYSTEM), యూనిట్ 3బీగా నాడీ నియంత్రణ, సమన్వయం (న్యూరాల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్) (NURAL CONTROL AND COORDINATION) అనే చాప్టర్స్ ఉన్నాయి.

    మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం4 (హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ-4) (HUMAN ANATOMY AND PHYSIOLOGY-4)లో యూనిట్ 4బీ గా రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) (IMMUNE SYSTEM) అనే రెండు చాప్టర్స్ ఉన్నాయి.

    మానవ ప్రత్యుత్పత్తి (హ్యూమన్ రీప్రొడక్షన్) (HUMAN REPRODUCTION)లో యూనిట్ 5ఏ గా మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ (హ్యూమన్ రీప్రొడక్టవ్ సిస్టమ్) (HUMAN REPRODUCTIVE SYSTEM), యూనిట్ 5బీ గా ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం (రీప్రొడక్టివ్ హెల్త్) (REPRODUCTIVE HEALTH) అనే చాప్టర్స్ ఉన్నాయి.

    జన్యు శాస్త్రం (జెనెటిక్స్)(GENETICS) అనే ఒకే ఒక్క చాప్టర్ ఉంది.

    జీవ పరిణామం (ఆర్గానిక్ ఎవల్యూషన్) (ORGANIC EVOLUTION) ఉంది.
    అనువర్తిత జీవశాస్త్రం (అప్లయిడ్ బయాలజీ) (APPLIED BIOLOGY) అనే చాప్టర్ ఉంది. తొలగించిన టాపిక్స్..ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీ లో ఎనిమిది యూనిట్లు ఉంటాయి.



    పరీక్షలో సెక్షన్ ఏ -  లో మొత్తం 15 ప్రశ్నలు ఉండగా అందులో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది..10×2=20.
    సెక్షన్ బి లో మొత్తం మొత్తం 14 ప్రశ్నలు ఉండగా అందులో ఆరు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది..6×4=24...
    సెక్షన్ సీ లు మొత్తం నాలుగు ప్రశ్నలు ఉండగా అందులో రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.. 2×8=16. ఈ మాదిరిగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వృక్ష శాస్త్రం జంతుశాస్త్రం సంబంధించిన ప్రశ్న పత్రం నమూనా ఇది..
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, Intermediate exams, Telangana inter board, Telangana intermediate board exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు