Home /News /jobs /

INTER COLLEGES GOOD NEWS FOR PRIVATE INTER COLLEGES BOARD THAT PREPARES GUIDELINES EVK

Inter Colleges: ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు గుడ్ న్యూస్.. మార్గదర్శకాలు సిద్ధం చేసిన బోర్డు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Inter Colleges | రాష్ట్రంలో ఇంటర్‌ బోర్డు ప్రైవేట్‌ జూనియర్‌ (ఇంటర్మీడియట్‌) కాలేజీల అనుబంధ గుర్తింపుపై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించే ప‌నిలో ప‌డింది. కాలేజీల అనుబంధ గుర్తింపును ఏడాది నుంచి మూడేండ్లు లేదంటే ఐదేండ్లకు పొడిగించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ ఇంటర్‌ బోర్డు (Inter Board) ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల అనుబంధ గుర్తింపుపై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించే ప‌నిలో ప‌డింది. కాలేజీల అనుబంధ గుర్తింపును ఏడాది నుంచి మూడేండ్లు లేదంటే ఐదేండ్లకు పొడిగించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మూడు లేదా ఐదేండ్లకు అనుమతులిచ్చేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. . ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఏటా అనుబంధ గుర్తింపును జారీచేస్తున్నారు.

    Free Coaching: న‌ర్సింగ్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ఆరు నెల‌ల పాటు ఉచిత శిక్ష‌ణ‌


    కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదు కానీ, ఉన్న కాలేజీలకే గుర్తింపును పొడిగిస్తున్నారు. దీని ద్వారా కాలేజీల‌కు ఎంతో లాభం చేకూరుతుంద‌నే యాజామాన్యాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

    ప్రస్తుతం నడుస్తున్న కాలేజీలు ఏటా దరఖాస్తులు సమర్పించి, అనుబంధ గుర్తింపు పొందుతున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం గుర్తింపు ప్రక్రియ కారణంగా అడ్మిషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొన్నిసార్లు పరీక్ష ఫీజులు చెల్లించే వరకు అనుబంధ గుర్తింపు లేకుండానే కాలేజీలు నడుస్తున్నాయి.

    ఈ నేపథ్యంలోనే అనుబంధ గుర్తింపును మూడేండ్లు లేదా ఐదేండ్లకు పొడిగించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు కోసం ఇప్పటివరకు 1,408 జూనియర్‌ కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. రాష్ట్రంలో 1,699 కాలేజీలుండగా, 291 కాలేజీలు దరఖాస్తు చేయలేదు.

    Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

    రూ.20 ఫైన్‌తో ఈ నెల 17 వరకు దరఖాస్తుకు అవకాశంది.  అనుబంధ గుర్తింపును మూడేండ్లు లేదా ఐదేండ్లకు పొడిగిస్తే అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యాలకు రెండింటికి లాభం చేకూరుతుందని తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు గౌరీసతీశ్‌ తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Intermediate, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు