Nara Lokesh: నారా లోకేష్ దెబ్బకు దిగి వచ్చిన ఏపీ ప్రభుత్వం.. సోషల్ మీడియాలో పోస్టుల హోరు

సీఎం జగన్, లోకేష్ (ఫైల్)

ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. లోకేష్ విజయం సాధించారంటూ సంబర పడుతున్నారు. సోషల్ మీడియాను పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

 • Share this:
  ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు, కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు ఫుల్ సందడి చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లైతో సోషల్ మీడియాలో లోకేష్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం  వెనుక లోకేష్ ఒత్తిడి పని చేసిందని.. లోకేష్ డిమాండ్ తో ఏపీ ప్రభుత్వం తలొగ్గక తప్పలేదంటున్నారు.  ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే..?  ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది.  జూలై 31వ తేదీ లోపు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో.. ఆ స‌మ‌యంలో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌ని విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ చెప్పారు. అందుకే పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీలో పది ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని విపక్షాలు, పలు విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తామంటూ పదే పదే ప్రకటనలు చేసింది.  విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చింది.  కానీ సుప్రీం కోర్టు మాత్రం క‌రోనా నేప‌థ్యంలో ప‌రీక్షల‌ను నిర్వహించే ఉద్దేశం ఉంటే వెంటనే తేదీలను ప్రకటించాలని.. అలాగే ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా కోటి రూపాయల పరిహారం ఇస్తారా అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ పేరుతో ముందుకు వెళ్లడం కన్నా.. రద్దు చేయడమే మేలను ప్రభుత్వం భావించినట్టు ఉంది. అందుకే పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటన చేసింది. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో మార్కులు ఎలా ఇస్తామ‌న్న విష‌యాన్ని త‌ర్వాత ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి తెలిపారు. మార్కుల‌ను కేటాయించే క్ర‌మంలో ఒక హై ప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

  అయితే పది పరీక్షల రద్దు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలుపెరుగుని పోరాటం చేశారు. సీఎం జగన్ కు పదే పదే లేఖలు రాశారు. ఆయన నుంచి స్పందన రాకపోవడంతో నేరుగా రాష్ట్ర గవర్నర్ కు.. ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా లోకేష్ లేఖలు రాస్తూ వచ్చారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకుని.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వాటి అప్ డేట్స్ చెబుతూ వచ్చారు. అక్కడితో ఆగక న్యాయ పోరాటం కూడా చేస్తూ వచ్చారు. పరీక్షల రద్దేయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాని ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ప్రభుత్వం మెడలు వంచైనా పరీక్షలు ఆగేలా చేస్తానంటూ మరో ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది...

  http://

  పరీక్షల రద్దు విషయం తెలిసిన దగ్గర నుంచి లోకేష్ వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులకు అభినందనలు అంటూ ఓ ట్వీట్ చేశారు. విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసిందని.. రెండు నెలల పోరాటం తరువాత @ysjagan దిగొచ్చి పరీక్షలు రద్దు చెయ్యడం సంతోషం అంటూ తొలి ట్వీట్ చేశారు..   http://

  మొండి పట్టుదలకు పోకుండా ఏప్రిల్ 18 న తాను మొదటి లేఖ రాసినప్పుడే పరీక్షలు రద్దు చేసి ఉంటే విద్యాసంవత్సరం వృధా కాకుండా ఉండటంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయం ఉండేదని రెండో ట్వీట్ చేశారు.   http://

  మానవత్వంతో ఆలోచించి ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదంటూ మరో ట్వీట్ చేశారు. మెంటల్ మామ అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదని. తుగ్లక్ నిర్ణయాలతో రెండు నెలల పాటు విద్యార్థులను హింసించడం దారుణమంటూ మరో ట్వీట్ చేశారు. http://

  దేశ అత్యున్నత న్యాయస్థానంలో చివాట్లు తినే పరిస్థితి మరోసారి తెచ్చుకోకండి. ఇప్పటికైనా ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవాలని జగన్ రెడ్డి గారిని కోరుతున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు.   http://

  కారణం ఏదైనా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోకేష్ విజయమే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.. లోకేష్ పోరాటంతోనే విద్యార్థులు, తల్లిదండ్రులు అంతా ఏకమయ్యారని.. ఈ పరిస్థితిల్లో ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: