హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Inter 2nd Year Maths 2B Model Paper: ఏపీ ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. ఇంటర్ సెకండ్ ఇయర్ మాధమేటిక్స్ (2B) మోడల్ పేపర్ 2

Inter 2nd Year Maths 2B Model Paper: ఏపీ ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. ఇంటర్ సెకండ్ ఇయర్ మాధమేటిక్స్ (2B) మోడల్ పేపర్ 2

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Intre 2nd Year Model Parpers | ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లానే ఎక్కువ మార్కులతో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మాధమేటిక్స్ అనే చెప్పాలి. మొత్తం 150 మార్కులకు మాధమేటిక్స్ సెకండ్ ఇయర్ వస్తుంది. సెకండ్ ఇయర్ మేధ్స్ సిలబస్ ను 2A, 2B విభాగాలుగా చేసారు.

ఇంకా చదవండి ...

సేకరణ  - ఆనంద్ మోహన్, న్యూస్ 18 తెలుగు, విశాఖపట్నం

ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లానే ఎక్కువ మార్కులతో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మాధమేటిక్స్ అనే చెప్పాలి. మొత్తం 150 మార్కులకు మాధమేటిక్స్ సెకండ్ ఇయర్ వస్తుంది. సెకండ్ ఇయర్ మేధ్స్ సిలబస్ ను 2A, 2B విభాగాలుగా చేసారు. ప్రశ్నాపత్రంలో కూడా 2Aలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు, 2Bలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కోవిడ్ కారణంగా 2A, 2B విభాగాల నుండి గత ఏడాది తగ్గించిన విధంగానే ఈ ఏడాది కూడా సుమారు 30 శాతం టాపిక్ లను, అందులోని సబ్ టాపిక్స్ ను తొలగించారు. అందువల్ల సిలబస్ నుండి తీసేసిన టాపిక్స్ మినహాయించి మిగిలిన అంశాలనుండే సెకండ్ ఇయర్ మాథమేటిక్స్ ప్రశ్నాపత్రం వస్తుంది.

ఇక మేధ్స్ 2B విషయానికి వస్తే.. ఇందులో ఆల్ జీబ్రా, ప్రోబబిలిటీ ఉంటాయి. 2Bలో కోఆర్డినేట్ జామెట్రీ (COORDINATE GEOMETRY) విభాగంలో  సర్కిల్(CIRCLE), సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ( SYSTEM OF CIRCLES), పేరాబోలా (PARABOLA), ఎలిప్స్(ELLIPSE), హైపర్ బోలా(HYBERPOLA) అనే టాపిక్స్ ఉన్నాయి.  మరో చాప్టర్ కాల్కులస్ (CALCULUS) లో ఇన్ డెఫినిట్ ఇంటిగ్రల్స్(INDEFINITE INTEGRALS) డెఫినిట్ ఇంటిగ్రల్స్(DEFINITE INTEGRALS), డిఫరెన్షియల్ ఈక్వేషన్ (DIFFERENTIAL EQUATION) అనే టాపిక్స్ ఉన్నాయి.

2Bలో 75 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. రెండింటిలోనూ మొదట 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. వీటికి ఛాయిస్ ఉండదు. 10 రాయాల్సి ఉంటుంది. తరువాత.. 4 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో ఐదు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు. చివరిగా.. 7 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. 2 ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి.

ఇక 2Bలో 75 మార్కులకు ఒక్కొక్క టాపిక్ నుండి వచ్చే ప్రశ్నలు చూద్దాం..మొదటి విభాగం COORDINATE GEOMETRYలో CIRCLE అనే టాపిక్ నుండి రెండు 7 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. SYSTEM OF CIRCLES అనే టాపిక్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. PARABOLA అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి.

ELLIPSE అనే టాపిక్ నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. HYBERPOLA అనే చివరి టాపిక్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. ఇక మరో విభాగం CALCULUS లో INTEGRATION అనే టాపిక్ నుండి రెండు 7 మార్కుల ప్రశ్నలు, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. DEFINITE INTEGRALS అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక DIFFERENTIAL EQUATION అనే చివరి టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి.

సెకండ్ ఇయర్ మేథ్స్ 2B లో వచ్చే 75 మార్కులకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సింపుల్ గా మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలి? ఏ చాప్టర్లు ప్రాక్టీస్ చేయాలి?

ఇందులో ఇందులో రెండు పార్ట్ల్ లుగా  చాప్టర్లు ఉంటాయి. మొదటిది COORDINATE GEOMETRYలో CIRCLE, SYSTEM OF CIRCLES, PARABOLA, ELLIPSE, HYBERPOLA అనే చాప్టర్ లు ఉంటాయి. రెండవ పార్ట్ లో CALCULUS లో INTEGRATION, DEFINITE INTEGRALS, DIFFERENTIAL EQUATION అనే చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట పార్ట్ COORDINATE GEOMETRY లోని CIRCLE, SYSTEM OF CIRCLES ప్రిపేర్ అయితే.. దాదాపు 28 మార్కులు వస్తాయి. కాబట్టి ఇది మొదట ప్రిపేర్ కావడం బెటర్.

తరువాత CALCULUS లోని మూడు చాప్టర్లు INTEGRATION, DEFINITE INTEGRALS, DIFFERENTIAL EQUATION మీద ఏమాత్రం పట్టు ఉన్నా మంచి మార్కులు సాధించవచ్చు. ఇందులో దాదాపు 46 మార్కులు కవర్ అవుతాయి. ఇలా ఈ రెండు చాప్టర్లను ప్రిపేర్ అయిపోతే.. దాదాపు 74 మార్కులకు సమాధానాలు రాసేయవచ్చు. అంటే దాదాపు 2B పూర్తిగా రాసేసినట్టే. తరువాత PARABOLA, ELLIPSE, HYBERPOLA ప్రిపేర్ కావడం బెటర్. ఈ మూడు టాపిక్స్ నుండి 23 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇలా 2B లో వీలైనని ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

ఓవరాల్ గా చెప్పాలంటే..  ఇక 2Bలోని రెండవ పార్ట్ CALCULUS లోని టాపిక్స్ కష్టంగా అనిపించే వారు.. ఫస్ట్ పార్ట్ ప్రిపేర్ కావడం బెటర్. కానీ CALCULUS లోని మూడు చాప్టర్ల మీద ఏమాత్రం పట్టు ఉన్నా.. ముందు ఈ పార్ట్ నే చదవడం బెటర్. ఎందుకంటే.. ఇందులో దాదాపు 46 మార్కులు కవర్ అవుతాయి..

ఇక ఫస్ట పార్ట్ COORDINATE GEOMETRY లోని CIRCLE, SYSTEM OF CIRCLES ప్రిపేర్ అయితే.. దాదాపు 28 మార్కులు వస్తాయి. అంటే దాదాపు 74 మార్కులు ఈ టాపిక్ లను చదివి, ప్రాక్టీస్ చేసి సమాధానాలు రాయగలిగితే.. ఇక మిగిలిన  కొన్ని టాపిక్స్ లను, ఫార్ములాలను గుర్తు పెట్టుకుంటే.. మంచి మార్కులతో పాసయ్యే అవకాశం ఉంది.

First published:

Tags: AP inter board, AP Inter Exams 2022, Intermediate exams

ఉత్తమ కథలు