INTELLIGENCE BUREAU RECRUITMENT 2022 IB STARTED REGISTRATION PROCESS FORHIRING 150 ASSISTANT CENTRAL INTELLIGENCE OFFICERS GH SRD
IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. రూ.1,42,000 వరకు జీతం.. ఎలా అప్లై చేయాలంటే..
(ప్రతీకాత్మక చిత్రం)
IB Recruitment: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, సమయం, సెంటర్ వివరాలను ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం రూ. 44,900 నుండి రూ.1,42,400 వరకు ఉంటుంది.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక ప్రకటన చేసింది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. ACIO గ్రేడ్-II/ టెక్నికల్ పోస్ట్ కోసం అభ్యర్థులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ mha.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు చివరి తేదీని మే 7, 2022గా నిర్ణయించారు.
* ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్-2022 వివరాలు
రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా మొత్తం150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. అందులో 56 పోస్ట్‌లు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు కేటాయించారు. మరో 94 పోస్టుల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రస్తుత గవర్నమెంట్ రిజర్వేషన్ విధానాలకు లోబడి ఉంటుంది.
* అర్హత ప్రమాణాలు
ఎడ్యుకేషన్
రిక్రూట్మెంట్కు అర్హత పొందాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్‌లో కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చెల్లుబాటు అయ్యే గేట్ 2020, 2021 లేదా 2022 స్కోర్‌కార్డ్‌ను కలిగి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి సంబంధిత సబ్జెక్టులలో BTech లేదా BE డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
ఇంటెలిజెన్స్ ACIO-2022 పరీక్ష రాయడానికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అప్పర్ క్యాప్‌లో SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC వర్గానికి చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఇచ్చారు. డిపార్ట్మెంటల్ అభ్యర్థుల విషయానికొస్తే, దరఖాస్తుదారు IBలో కనీసం 3 సంవత్సరాల రెగ్యులర్, కంటిన్యూ సర్వీస్ పూర్తి చేసినట్లయితే వయోపరిమితి 40 సంవత్సరాల వరకు సడలింపు ఉండనుంది.
దరఖాస్తు విధానం
స్టెప్1: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి
స్టెప్2: హోమ్ పేజీలో What’s New అనే సెక్షన్‌పై క్లిక్ చేసి ఆపై ఇంటెలిజెన్స్ ACIO Exam -2022 నోటిఫికేషన్ ను క్లిక్ చేయాలి
స్టెప్3: అవసరమైన వివరాలను అందించడం కోసం వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సిన కొత్త పేజీ రీ డైరెక్టెడ్ అవుతుంది.
స్టెప్4: కొత్తగా క్రియేట్ చేసిన రిజిస్ట్రేషన్ వివరాలతో మీ ఖాతాకు లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
స్టెప్5: అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
స్టెప్6: అవసరమైన డాక్యుమెంట్ల సాప్ట్ కాపీలను జతచేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి
స్టెప్7: భవిష్యత్ అవసరాల కోసం రసీదును సేవ్ చేసుకోండి
* అప్లికేషన్ ఫీజు వివరాలు
జనరల్, EWS, OBC వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రం రూ. 100 దరఖాస్తు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఇతర అభ్యర్థులందరూ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
* ఎంపిక ప్రక్రియ
ఖాళీల సంఖ్యను బట్టి 10 రెట్ల వరకు అభ్యర్థులను GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, సమయం, సెంటర్ వివరాలను ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం రూ. 44,900 నుండి రూ.1,42,400 వరకు ఉంటుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.