Home /News /jobs /

INTELLIGENCE BUREAU IB RECRUITMENT NOTIFICATION 2022 RELEASED FOR 766 ACIO HERE ARE ELIGIBILITY AND OTHER DETAILS GH SK

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు.. పోస్టులు, జీతం వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IB Recruitment: ఐబీ రిక్రూట్‌మెంట్ 2022 కోసం సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ లేదా స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ లేదా డిఫెన్స్ ఫోర్సెస్ కింద పని చేస్తున్న అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

IB Recruitment: భారత హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (intelligence Bureau) 766 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఐబీ (IB) ఓ రిక్రూట్‌మెంట్ (Recruitment) నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. సెక్యూరిటీ అసిస్టెంట్, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వంటి పోస్టులతో సహా గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల కోసం ఐబీ రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ 2022 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను డిప్యూటేషన్ ప్రాతిపదికన (Deputation Basis) ఇంటెలిజెన్స్ బ్యూరో నియమించుకుంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను ఆఫ్‌లైన్ మోడ్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ mha.gov.in ను విజిట్ చేయవచ్చు. నోటిఫికేషన్ విడుదలైన 60 రోజులలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

CM KCR | Telangana jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఐబీ రిక్రూట్‌మెంట్ 2022 కోసం సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ లేదా స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ లేదా డిఫెన్స్ ఫోర్సెస్ కింద పని చేస్తున్న అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటేషన్ వ్యవధి పూర్తయిన తర్వాత మళ్లీ వారు తమ పేరెంట్ డిపార్ట్‌మెంట్ లో చేరవచ్చు.  766 ఖాళీలలో ఏయే భాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఆ పోస్టులకు కావలసిన అర్హత ఏంటి? జీతం వంటి వివరాలన్నీ నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

 పోస్టుల వివరాలు:

- అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ ఎగ్జిక్యూటివ్: 70 పోస్ట్‌లు,

- అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ ఎగ్జిక్యూటివ్: 350 పోస్ట్‌లు

- జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ ఎగ్జిక్యూటివ్: 50 పోస్ట్‌లు

- జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ ఎగ్జిక్యూటివ్: 100 పోస్ట్‌లు

- సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్: 100 పోస్ట్‌లు

- జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/MT: 20 పోస్ట్‌లు

- జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/MT: 35 పోస్ట్‌లు

- సెక్యూరిటీ అసిస్టెంట్/MT: 20 పోస్టులు

- హల్వాయి-కమ్-కుక్: 9 పోస్ట్‌లు

- కేర్‌టేకర్: 5 పోస్టులు

- జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/Tech: 7 పోస్టులు

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



IB రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ మోడ్‌లోనే జరుగుతుంది. "అభ్యర్థి గత డిప్యూటేషన్ నుంచి 3 సంవత్సరాల కూలింగ్-ఆఫ్ వ్యవధిని పూర్తి చేసి ఉండాలి. ఇంతకుముందు 1 కంటే ఎక్కువ డిప్యూటేషన్‌ను పొందని వారు, అసిస్టెంట్ డైరెక్టర్/G-3, ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 35 SP మార్గ్, బాపు ధామ్, న్యూఢిల్లీ-110021 చిరునామాకి డాక్యుమెంట్స్‌ ఫార్వార్డ్ చేయవచ్చు." IB రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ వారీగా అవసరమైన విద్యార్హత, అవసరమైన డాక్యుమెంట్స్, ఇతర ముఖ్యమైన వివరాలను చదవడం మంచిది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Govt Jobs 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు