హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AI in CBSE: విద్యారంగంలో డిజిటల్‌ విప్లవం.. పాఠశాల స్థాయిలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..

AI in CBSE: విద్యారంగంలో డిజిటల్‌ విప్లవం.. పాఠశాల స్థాయిలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..

AI in CBSE: విద్యారంగంలో డిజిటల్‌ విప్లవం.. పాఠశాల స్థాయిలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..

AI in CBSE: విద్యారంగంలో డిజిటల్‌ విప్లవం.. పాఠశాల స్థాయిలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..

AI in CBSE: విద్యార్థులు డిజిటల్‌ విద్యను అందిపుచ్చుకునేలా మరో అడుగు ముందుకు పడింది. ఇంటెల్‌ ఇండియా, NITI ఆయోగ్‌లో భాగమైన అటల్ ఇన్నొవేషన్ మిషన్(AIM), సీబీఎస్‌ఈ బోర్డులు దీనిపై కలిసి పనిచేస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

అంతర్జాతీయంగా డిజిటల్ టెక్నాలజీ (Digital Technology) ప్రభావం విపరీతంగా పెరిగింది. ప్రధాని మోదీ (PM Narendra Mdoi) డిజిటల్‌ ఇండియాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే క్రమంలో 2023-24 బడ్జెట్‌లో డిజటలైజ్డ్ ఎడ్యుకేషన్‌, డిజిటల్‌ లైబ్రరీలకు భారీగా నిధులు కేటాయించారు. విద్యార్థులు డిజిటల్‌ విద్యను అందిపుచ్చుకునేలా మరో అడుగు ముందుకు పడింది. ఇంటెల్‌ ఇండియా, NITI ఆయోగ్‌లో భాగమైన అటల్ ఇన్నొవేషన్ మిషన్(AIM), సీబీఎస్‌ఈ బోర్డులు దీనిపై కలిసి పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT), కంప్యూటేషనల్ థింకింగ్, అల్గారిథమిక్ థింకింగ్ వంటి అంశాలను అకడమిక్‌ కరిక్యులమ్‌లో చేర్చేలా కృషి చేస్తున్నాయి.

* ఏం చేస్తారంటే

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో 2022 సెప్టెంబర్‌లో ‘AIoT ఇంటిగ్రేషన్ ఇన్ స్కూల్ కరిక్యులమ్’ను ప్రవేశపెట్టారు. ఈ ప్రోగ్రామ్‌లో కొత్త టెక్నాలజీని ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా నేర్చుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT)తో సబ్జెక్ట్‌ ప్లాన్‌ తయారుచేస్తారు. దీనిపై కంప్యూటర్‌ టీచర్లకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లకు నేర్పించడంతో పాటు తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో బోధిస్తారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టింకరింగ్ ల్యాబ్‌లలో పిల్లలను ప్రోత్సహిస్తారు. వారితో కొత్త ప్రాజెక్టులు చేయిస్తారు.

* సవాళ్లు అధిగమిస్తేనే..

AI, డేటా క్లీనింగ్, ప్రోటోటైపింగ్, సర్క్యూట్ బిల్డింగ్, ప్రోగ్రామింగ్ బోధించడం ద్వారా పిల్లల్లో డిజిటల్‌ నైపుణ్యాలు పెరుగుతాయని APJ, గవర్నమెంట్ పార్ట్నర్‌షిప్‌ & ఇనీషియేటివ్స్‌, ఇంట్‌లోని గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ సీనియర్‌ డైరెక్టర్‌ శ్వేతా ఖురానా పేర్కొన్నారు. NEP సైతం వీటిని ప్రోత్సహిస్తోందని ఆమె అన్నారు. అయితే వీటి అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.

మౌలిక సదుపాయాలు లేకపోవడం, భారీ నిధుల రూపంలో సవాళ్లు కూడా ఎదురవుతాయని ఆమె అన్నారు. వీటిని అధిగమించి AI, IoTను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. అప్పుడే ప్రపంచంలో భారత్‌ ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. ఈ డిజిటల్‌ సాంకేతికత దుర్వినియోగం కాకుండా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు.

* ఎప్పటినుంచో అడుగులు

2019 నుంచే ఇంటెల్, CBSE పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. 20,000 మంది ఉపాధ్యాయులు, 3,50,000 మంది విద్యార్థులకు బూట్‌, మెంటరింగ్‌ క్యాంపులు నిర్వహించారు. 2021లో AI స్టూడెంట్‌ కమ్యూనిటీని, 2022లో టీచర్స్‌ కమ్యునిటీని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి :ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ జీకే ప్రశ్నలకు ఆన్సర్స్ తెలుసుకోండి..

అలాగే 2020లో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖలో భాగమైన నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘రెస్పాన్సిబుల్‌ AI ఫర్ యూత్' కార్యక్రమాన్ని ప్రారంభించి 50,000 విద్యర్థులను చేర్చుకున్నట్లు ఖురానా తెలిపారు. 2021లో మోదీ ప్రారంభించిన ‘ఏఐ ఫర్ ఆల్’లో భాగంగా 11 భారతీయ భాషల్లో ఏడాదిలో ఒక మిలియన్‌ మందికి AIపై అవగాహన పెంచేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు రెండేళ్లల్లో 3 మిలియన్ల మందిని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2022లో ఇంటెల్, ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంతో కలిసి ఇన్‌స్పైర్-అవార్డ్స్ మనక్ స్కీమ్లో అవార్డు సాధించిన వారికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 10,000 మంది ఇందులో శిక్షణ పొందారు.

First published:

Tags: CAREER, Career and Courses, Education CBSE, JOBS