Intel: ఇంటెల్ నుంచి 1,50,000 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ

బెంగళూరులో Intel AI DevCamp పేరుతో ప్రీమియర్ గ్లోబల్ ఏఐ డెవలపర్ ఈవెంట్ నిర్వహించింది ఇంటెల్. ఈ ఈవెంట్‌లో సైంటిస్టులు, డెవలపర్లు, అనలిస్టులు, ఇంజనీర్లకు ఏఐ టూల్స్ అందజేసింది.

news18-telugu
Updated: August 9, 2019, 12:56 PM IST
Intel: ఇంటెల్ నుంచి 1,50,000 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ
Intel: ఇంటెల్ నుంచి 1,50,000 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గత రెండేళ్లలో భారతదేశంలో 150 సంస్థలకు చెందిన డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లకు ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇచ్చినట్టు కంప్యూటర్ చిప్స్ తయారు చేసే దిగ్గజ కంపెనీ అయిన ఇంటెల్ ప్రకటించింది. అంతేకాదు... భారతదేశంలో పనిచేస్తున్న ఇంటెల్ ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఈ శిక్షణ ఇచ్చినట్టు ఇంటెల్ తెలిపింది. బుధవారం బెంగళూరులో Intel AI DevCamp పేరుతో ప్రీమియర్ గ్లోబల్ ఏఐ డెవలపర్ ఈవెంట్ నిర్వహించింది ఇంటెల్. ఈ ఈవెంట్‌లో సైంటిస్టులు, డెవలపర్లు, అనలిస్టులు, ఇంజనీర్లకు ఏఐ టూల్స్ అందజేసింది.

దేశవ్యాప్తంగా 1,50,000 మంది డెవలపర్లు, విద్యార్థులతో పాటు 50 శాతం మంది ఇంటెల్ ఉద్యోగులకూ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇచ్చాం. ఈ ఏడాది చివరి నాటికి ఇంటెల్ ఉద్యోగులందరికీ ట్రైనింగ్ ఇస్తాం. అన్ని రంగాల్లో ఏఐ ఆధారిత అప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ రంగంలో నిపుణులు కీలకం. అందుకే డెవలపర్లు, ప్రోగ్రామర్లు స్కిల్స్ పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాం.

ప్రకాశ్ మాల్యా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ గ్రూప్, ఇంటెల్ ఇండియా


ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా కొత్త కోర్సులు రూపొందుతున్నాయి. మరోవైపు ఇంటెల్ లాంటి కంపెనీలు కూడా భావి ఇంజనీర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇస్తూ కావాల్సిన నైపుణ్యాలని అందిస్తుండటం విశేషం.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు

ఇవి కూడా చదవండి:

Jobs: వామ్మో... లక్షల్లో ఆదాయమిచ్చే ఈ జాబ్స్ గురించి తెలుసుకుంటే షాకవ్వాల్సిందే

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

NTPC Jobs: ఇంజనీరింగ్ చదివారా? ఎన్‌టీపీసీలో 203 ఖాళీలు
First published: August 9, 2019, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading