INTEGRAL COACH FACTORY CHENNAI IS HIRING 876 APPRENTICES 10TH PASS CAN APPLY STIPEND UP TO RS 7000 AND KNOW MORE DETAILS HERE VB
Railway Recruitment 2022: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..
ప్రతీకాత్మక చిత్రం
Railway Recruitment 2022: పది, ఇంటర్ విద్యార్హతతో ‘ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై’లో వివిధ రకాల అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలిలా..
భారతీయ రైల్వే(Indian Railways) సంస్థ అయిన ‘ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై’లో (ICF) వివిధ రంగాలలో 876 అప్రెంటిస్‌షిప్ పోస్టులను(Apprentice Posts) భర్తీ చేసేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్(Online Registration) ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం అప్రెంటిషిప్ పోస్టుల్లో 276 పోస్టలు ఫ్రెషర్లకు(Freshers), 600 ఎక్స్-ఐటిఐలకు రిజర్వ్(Reserve) చేయబడ్డాయి. 276 పోస్టుల్లో.. కార్పెంటర్ 37, ఎలక్ట్రీషియన్ 32, ఫిట్టర్ 65, మెషినిస్ట్ 34, పెయింటర్ 33, వెల్డర్ 75 పోస్టులగా కేటాయించారు. Ex-ITI కోసం మొత్తం 600 పోస్టులు ఉన్నాయి. ఇందులో కార్పెంటర్ 50, ఎలక్ట్రీషియన్ 156, ఫిట్టర్ 143, మెషినిస్ట్ 29, పెయింటర్ 50, వెల్డర్ 170 తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ pb.icf.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్(Registration) ప్రక్రియ సోమవారం, జూన్ 27, 2022న ప్రారంభమైంది. దరఖాస్తుదారులు జూలై 26 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు 10వ తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడతారు. అప్రెంటిస్‌షిప్ అభ్యర్థులకు నెలవారీ స్టైపెండ్ లభిస్తుంది. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులైన ఫ్రెషర్లకు రూ.6,000, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.7000 అందజేస్తారు. ఇదిలా ఉండగా, జాతీయ లేదా రాష్ట్ర సర్టిఫికెట్ ఉన్న మాజీ ఐటీఐలకు కూడా రూ.7,000 అందజేస్తారు.
విద్యార్హత: ఫ్రెషర్ అభ్యర్థి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. Ex-ITI అభ్యర్థి తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే NCVT, SCVT ద్వారా జారీ చేయబడిన నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూలై 26 నాటికి అభ్యర్థి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో OBC కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా.. Step 1: ICF అధికారిక వెబ్‌సైట్‌కి pb.icf.gov.in వెళ్లాలి.
Step 3: దీనిలో ముడూ భాగాలు ఉంటాయి. మొదటిది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుము (అదనంగా సర్వీస్ ఛార్జీలు వర్తించే విధంగా) చెల్లించాలి. SC, ST, PwBD మరియు మహిళా వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ ఫామ్ ను వివరాలతో పూర్తి చేయాలి.
Step 4: దరఖాస్తు చేయడం పూర్తి అయిన తర్వాత.. ఆ పీడీఎఫ్ ను ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.