హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In Hyderabad: హైదరాబాద్ ఇన్సురెన్స్ కార్యాలయంలో ఉద్యోగ ఖాళీలు.. జీతం రూ. 58వేలకు పైగా..

Jobs In Hyderabad: హైదరాబాద్ ఇన్సురెన్స్ కార్యాలయంలో ఉద్యోగ ఖాళీలు.. జీతం రూ. 58వేలకు పైగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసస్ కార్యాలయం, హైదరాబాద్ వారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసస్ కార్యాలయం, హైదరాబాద్ వారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను (Job Application) సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. దరఖాస్తులకు రెండు రోజులు మాత్రమే గుడువు ఉంది.  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సూచించిన చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

S.No.పోస్టుఖాళీలువేతనం
1.సివిల్ అసిస్టెంట్ సర్జన్59రూ.58,850
2.డెంటల్ అసిస్టెంట్ సర్జన్01రూ.58,850
3.ల్యాబ్ టెక్నీషియన్11రూ.31,040
4.ఫార్మసిస్ట్43రూ.31,040
మొత్తం:114

విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లు ఉండాలి.

TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. సూర్యాపేట జిల్లాలో కాంట్రాక్ట్ జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి

దరఖాస్తు చేయడం ఎలా:

- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (https://hyderabad.telangana.gov.in/) లేదా పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

- అనంతరం అప్లికేషన్ ఫామ్ లో పేర్కొన్న వివరాలను పూర్తిగా నింపాల్సి ఉంటుంది.

- అప్లికేషన్ ఫామ్ ను పోస్టు లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్ , అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పటల్, సనత్ నగర్, నాచారం, హైదాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

- దరఖాస్తులను మార్చి 28వ తేదీ నాటికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.

First published:

Tags: Hyderabad, JOBS

ఉత్తమ కథలు