Home /News /jobs /

INSTITUTE OF RURAL MANAGEMENT ANAND HAS RELEASED A NOTIFICATION FOR VARIOUS POSTS KNOW FULL DETAILS HERE VB

IRMA Recruitment Jobs: 10 అర్హతతో గ్రామీణ ఆఫీసుల్లో జాబ్స్.. ఎలాంటి పరీక్షలు లేకుండా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (IRMA) సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రామీణాభివృద్ధి నిర్వహణలో భాగంగా.. ఆఫీస్ అసిస్టెంట్ , రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (IRMA) సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రామీణాభివృద్ధి నిర్వహణలో భాగంగా.. ఆఫీస్ అసిస్టెంట్ , రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అర్హత:
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు..
పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. దీనితో పాటు.. ప్రాథమిక ఇంగ్లీష్ అండ్ హిందీ చదవే సామర్థ్యం ఉండాలి. విద్యా సంస్థలో ఇదే హోదాలో రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 జూలై, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు నాలుగు రోజులే గడువు

రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు..
ఆర్థిక శాస్త్రంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. సామాజిక శాస్త్ర రంగంలో పని అనుభవం ఉండాలి. ప్రాథమిక ఎకనామెట్రిక్ నైపుణ్యాలతో పాటు.. గణాంక సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలలో అనుభవం ఉండాలి. ఇంగ్లీష్ లో మౌఖిక అండ్ రాత పరీక్షలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ 22జూలై, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

వయస్సు:
ఆఫీస్ అసిస్టెంట్, రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.  అసిస్టెంట్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంపిక చేయనున్నారు.

జీతం:
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.10 వేల నుంచి రూ. 12 వేల మధ్య జీతం చెల్లించనున్నారు. రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు రూ.37 వేలు జీతం చెల్లించనున్నారు. 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు 6 నెలలు ప్రొబిషన్ పిరియడ్ లో చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకోండిలా..
Step 1 : మొదట అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

Step 2 : దీనిలో రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఎంచుకొని దానిలో ఈమెయిల్,పాస్ వర్డ్ లను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Step 3 :మెయిన్ వెబ్ సైట్ కు వెళ్లి.. లాగిన్ ఆప్షన్ ను ఎంచుకొని.. దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.  రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టుల కోసం  పూర్తి వివరాలకు ఇక్కడ తెలుసుకోండి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central jobs, Irma, JOBS

తదుపరి వార్తలు