Home /News /jobs /

INSTITUTE OF CHARTERED ACCOUNTANTS OF INDIA ICAI PLANNING TO CONDUCT OPEN BOOK EXAMINATION FOR CA STUDENTS SS GH

Open Book Exams: పుస్తకాలు చూస్తూ పరీక్షలు రాయొచ్చు... ఆ విద్యార్థులకు అవకాశం

Open Book Exams: పుస్తకాలు చూస్తూ పరీక్షలు రాయొచ్చు... ఆ విద్యార్థులకు అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)

Open Book Exams: పుస్తకాలు చూస్తూ పరీక్షలు రాయొచ్చు... ఆ విద్యార్థులకు అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)

Open Book Exams | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) త్వరలో పుస్తకాలు చూసి పరీక్షలు రాసే విధానాన్ని (Open Book Examination) ప్రవేశపెట్టనుంది. ఎందుకో తెలుసుకోండి.

భారతదేశంలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా బోధన, పరీక్షా విధానంలో అనేక కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బట్టీపట్టి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. ఇకపై విద్యార్థులు సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని విశ్లేషణాత్మక సమాధానాలు రాసేలా పరీక్షా విధానాలను మార్చేందుకు విద్యాసంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ (Open Book Examination) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రాబోయే రెండేళ్లలో చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షలో విద్యార్థుల ఆలోచనా విధానాన్ని పరీక్షించేలా ఓపెన్ బుక్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సీఏ ఫైనల్ పరీక్షలో మరిన్ని పేపర్లను ఓపెన్ బుక్ సిస్టమ్‌కు చేర్చనున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ నిహార్ జంబుసరియా తాజాగా తెలిపారు.

IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1968 పోస్టులు... ఇలా అప్లై చేయండి

"ప్రస్తుతం ఓపెన్-బుక్ సిస్టమ్‌లో కేవలం ఒకే ఒక ఎలక్టివ్ పేపర్‌కు మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నాం. అయితే విద్యార్థులు అప్లికేషన్-బేస్డ్ నాలెడ్జ్ కలిగి ఉండేలా మరిన్ని పేపర్‌లను ఓపెన్-బుక్ సిస్టమ్‌లోకి తీసుకురావడానికి మా కమిటీ సమీక్షిస్తోంది” అని జంబుసరియా తెలిపారు. విద్యార్థులకు ఈ సమయంలో సిట్యుయేషనల్ కేస్ స్టడీస్ ఇవ్వవచ్చని.. పుస్తకాన్ని అందించి వారు ప్రశ్నలకు సమాధానం కనుగొనగలరా? లేదా? అనేది కూడా తెలుసుకోవచ్చని జంబుసరియా చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయులు అడిగిన ఓపెన్ బుక్ ఎగ్జామ్ ప్రశ్నలకు సరైన సమాధానం రాయాలంటే.. విద్యార్థులు సబ్జెక్టును కూలంకషంగా చదివి అప్పటికే వాటిని అర్థం చేసుకొని ఉండాల్సి ఉంటుంది.

Ayush Recruitment 2021: ఆయుష్ శాఖలో ఉద్యోగాలు... రూ.70,000 వరకు వేతనం

ప్రస్తుతం ఐసీఏఐ(ICAI) కమిటీ ఓపెన్ బుక్ పరీక్షలను నిర్వహించే అవకాశాలను సమీక్షిస్తోంది. ఒకవేళ ఈ విధానాన్ని ఫిబ్రవరి 2022లోగా ఖరారు చేస్తే.. అది రాబోయే ఆరు నెలల నుంచి ఒక ఏడాది వ్యవధిలో అమల్లోకి వస్తుందని జంబుసరియా పేర్కొన్నారు. కరోనా తర్వాత సీఏ ప్లేస్‌మెంట్‌లు పెరిగాయన్నారు. "గతంలో 35-40% సీఏలు మాత్రమే ప్లేస్‌మెంట్‌ల్లో ఎంపికయ్యేవారు. కానీ ఆ నిష్పత్తి ఇప్పుడు 70%కి పెరిగింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. అయితే సీఏలు ఆడిట్ చేయడమే కాకుండా కష్టాల్లో ఉన్న వ్యాపారాలకు మళ్లీ పూర్వవైభవం తేగలరు.. ఆర్థిక పునర్నిర్మాణం కూడా చేయగలరు. కాబట్టి సీఏల అవసరం ఈ కాలంలో అందరికీ బాగా తెలిసొచ్చింది” అని జంబుసరియా వివరించారు.

TCS Jobs: డిగ్రీ పాసైనవారికీ టీసీఎస్‌లో 35,000 ఫ్రెషర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

ఐసీఏఐ ఆడిట్‌ల నాణ్యతను మెరుగుపరచడానికి ఎలాంటి ఛార్జీలు లేకుండా అన్ని సంస్థలకు ఆడిటింగ్ సాధనాలను కూడా అందించనుంది. "అనేక పెద్ద సంస్థలు ఆడిటింగ్ సాధనాలను అభివృద్ధి చేశాయి. అయితే అందరూ ఈ సాధనాల(tools)ను ఉపయోగించగలిగితే ఆడిటింగ్‌లో మెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి మేము ఈ సాధనాలను రెండు, మూడు సంవత్సరాల వరకు అందించాలని ప్లాన్ చేస్తున్నాం. ఆపై సభ్యులు వాటిని కొనుగోలు చేయవచ్చు" అని జంబుసరియా మీడియాతో చెప్పుకొచ్చారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన అభ్యర్థులు సీఏ కోర్సు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కొద్ది రోజుల క్రితం ఐసీఏఐ ప్రకటించింది. ఈ పథకం ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2023 వరకు అమల్లో ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: EDUCATION, Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు