Bank Jobs: త్వరలో ఐబీపీఎస్ నోటిఫికేషన్... భర్తీ చేసే పోస్టులు ఇవే

IBPS Recruitment 2020 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో ఐబీపీఎస్ ప్రతీ ఏటా వేలాది పోస్టుల్ని భర్తీ చేస్తోంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.

news18-telugu
Updated: June 1, 2020, 6:35 PM IST
Bank Jobs: త్వరలో ఐబీపీఎస్ నోటిఫికేషన్... భర్తీ చేసే పోస్టులు ఇవే
Bank Jobs: త్వరలో ఐబీపీఎస్ నోటిఫికేషన్... భర్తీ చేసే పోస్టులు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంకింగ్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? త్వరలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS త్వరలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో గ్రూప్ ఏ స్కేల్ 1, 2, 3 ఆఫీసర్స్, గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఐబీపీఎస్ గతంలో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020 ఆగస్ట్ 1న ప్రారంభం కావాలి. కాబట్టి ఇదే నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఇప్పటికే అన్ని పరీక్షలు, నోటిఫికేషన్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ విషయంలో ఐబీపీఎస్ ఏవైనా మార్పులు చేస్తుందో లేదో తెలియదు. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలే ఎక్కువ. ఆసక్తి గల అభ్యర్థులు అప్‌డేట్స్ కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఫాలో అవుతుండాలి. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. గత ఏడాది 8000 పైగా గ్రూప్ ఏ స్కేల్ 1, 2, 3 ఆఫీసర్స్, గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేసింది ఐబీపీఎస్. ఈసారి ఎన్ని పోస్టుల్ని ప్రకటిస్తుందో చూడాలి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

TCS iON: గుడ్ న్యూస్... టీసీఎస్ నుంచి ఉచితంగా స్కిల్ ట్రైనింగ్

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 1, 2020, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading