IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

IBPS PO Recruitment 2019 | డిగ్రీ పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్‌తో పాటు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

news18-telugu
Updated: August 4, 2019, 10:55 AM IST
IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ
IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 4, 2019, 10:55 AM IST
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 4,336 పోస్టులున్నాయి. దేశవ్యాప్తంగా అలాహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. డిగ్రీ పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్‌తో పాటు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవాళ్లు పైన వివరించిన బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్‌మెంట్ ట్రైనీగా జాయిన్ కావొచ్చు. ఇందుకోసం కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRPPO/MT-IX)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్ట్ 7న ప్రారంభం కానుంది. ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IBPS PO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం పోస్టుల సంఖ్య: 4,336

అలాహాబాద్ బ్యాంక్- 500
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 899
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 143


కెనెరా బ్యాంక్- 203
Loading...
కార్పొరేషన్ బ్యాంక్- 62
ఇండియన్ బ్యాంక్- 201
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్- 122
యూకో బ్యాంక్- 500
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 644
అర్హత: డిగ్రీ పాస్ కావాలి
వయస్సు: 20 నుంచి 30 ఏళ్లు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు

IBPS PO Recruitment 2019: ముఖ్యమైన తేదీలు


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 2019 ఆగస్ట్ 7
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 28
ఫీజు చెల్లింపు: ఆగస్ట్ 7 నుంచి ఆగస్ట్ 28
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్‌కు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2019 సెప్టెంబర్
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 28
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: అక్టోబర్ మొదటివారం
ప్రిలిమ్స్ పరీక్ష: అక్టోబర్ 12, 13, 19, 20
ప్రిలిమ్స్ ఫలితాల విడుదల: అక్టోబర్ లేదా నవంబర్
మెయిన్స్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 2019 నవంబర్
మెయిన్స్ పరీక్ష: నవంబర్ 30
మెయిన్స్ పరీక్ష ఫలితాల విడుదల: 2019 డిసెంబర్
ఐబీపీఎస్ పీఓ ఇంటర్వ్యూ: 2020 జనవరి లేదా ఫిబ్రవరి
ఐబీపీఎస్ పీఓ నియామకం: 2020 ఏప్రిల్

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Friendship Day 2019: మీ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా? ఈ 12 గ్యాడ్జెట్స్ ట్రై చేయండి


ఇవి కూడా చదవండి:

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 7966 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు... వివరాలివే

AP Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 జాబ్స్... జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇవే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో 79 ట్రైనీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...