రెండేళ్ల తర్వాత కరోనా(Corona) తగ్గుముఖం పట్టడంతో స్టూడెంట్స్ (Students) స్కూళ్లకు తిరిగి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రముఖ ఫొటో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఒక గైడ్‌ను(Guide) విడుదల చేసింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ (Fortis)తో కలిసి విద్యార్థులు ఆఫ్‌లైన్ స్కూళ్లలో చదవడానికి, వ్యక్తిగతంగా పరీక్షలకు సిద్ధం కావడానికి, పరీక్ష ఒత్తిడిని నియంత్రించడంలో హెల్ప్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ ఒక గైడ్‌ను లాంచ్ చేసింది. ఈ గైడ్ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బాగా హెల్ప్(Help) అవుతుంది. ‘రీఅడాప్ట్ అండ్ రీఅడ్జస్ట్: బ్యాక్ టు ది క్లాస్‌రూమ్’ (Readapt and Readjust: Back to the Classroom) అనే టైటిల్‌తో ఈ గైడ్‌ను ఇన్‌స్టాగ్రామ్ లాంచ్ చేసింది.
విద్యార్థులకు స్టడీస్ & ఎగ్జామ్స్ మేనేజ్ చేయడానికి ప్రాక్టికల్ టిప్స్ అందించడం, ఒత్తిడిని ఎదుర్కోవటానికి లెర్నింగ్ స్ట్రాటజీస్ ఆఫర్ చేయడం, ఏకాగ్రతను మెరుగుపరచడానికి స్టడీ టెక్నిక్స్ అందించడంపై ఈ గైడ్ దృష్టి పెడుతుంది. ఇది షార్ట్-టర్మ్ రిలీఫ్ కోసం రిలాక్సేషన్ టెక్నిక్స్, అలాగే మెంటల్ హెల్త్ మేనేజ్ చేయడానికి ముఖ్యమైన సెల్ఫ్-కేర్ ప్రాక్టీసెస్ ను కలిగి ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్ సంస్థ పేర్కొంది.
ఈ గైడ్ గురించి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోని ఫోర్టిస్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ పారిఖ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఈ గైడ్ విద్యార్థులకు అంతర్దృష్టి (Insights), విజ్ఞానం పెంపొందించుకోవడానికి... ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. సరైన పనితీరు, విజయం వైపు విద్యార్థులు అడుగులు వేసేలా వారికి మార్గనిర్దేశం చేయాలి. నైపుణ్యాలతో వారిని శక్తివంతం చేయాలి. ఇన్‌స్టాగ్రామ్, సంగత్‌తో భాగస్వామ్యం అయినందుకు మేం సంతోషిస్తున్నాం" అని డా.సమీర్ పేర్కొన్నారు.
Amazon: ఇక అమెజాన్‌లో మరింత ఎంటర్‌టైన్మెంట్.. త్వరలో కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్
ఇట్స్ ఓకే టు టాక్, సంగత్ దర్శకుడు పాటీ గోన్సాల్వేస్ మాట్లాడుతూ... “రెండేళ్ల కరోనా తర్వాత పాఠశాలకు తిరిగి వచ్చేందుకు పిల్లల్లో ఉత్సాహంతో పాటు భయాందోళన కచ్చితంగా ఉంటుంది. స్నేహితులను, ఉపాధ్యాయులను మళ్లీ చూడటం, వారితో ఎలా వ్యవహరించాలనే దాని గురించి కొత్త నియమాలు ఉన్నాయి. తిరిగి రావడం అంటే పాఠశాలలో అనేక మార్పులను ఎదుర్కోవడం, పరీక్షలలో ఇంకా బాగా రాణించడం. ఫోర్టిస్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం, ఇన్‌స్టాగ్రామ్, సంగత్ కలిసి అందించిన కలెక్టివ్ గైడెన్స్ మరింత మంది విద్యార్థులు మరింత ప్రిపేర్డ్ గా ఫీల్ అయ్యేలా హెల్ప్ చేస్తుందని మేం ఆశిస్తున్నాం" అని అన్నారు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇండియా (మెటా) పబ్లిక్ పాలసీ హెడ్ నటాషా జోగ్ మాట్లాడుతూ, “యువత శ్రేయస్సు ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి. యువత జీవితాలను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మేం 'రీఅడాప్ట్ అండ్ రీఅడ్జస్ట్' గైడ్ తీసుకువచ్చాం. ఇన్‌స్టాగ్రామ్‌తో ఈ గైడెన్స్ రీచ్ పెరిగి ఎక్కువ మంది యువకులు దీని నుంచి ప్రయోజనం పొందుతారని మేం ఆశిస్తున్నాం." అని అన్నారు.
ఈ గైడ్‌ను ఫాలో అవ్వాలనుకునే విద్యార్థులు https://www.instagram.com/fortismentalhealth/guide/handling-exam-stress/17903811869544013/?igshid=YmMyMTA2M2Y= లింకుపై క్లిక్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Instagram, New Guidelines, Offline, Schools