హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In IWAI: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

Jobs In IWAI: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీటిపారుదల శాఖ పరిధిలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నీటిపారుదల శాఖ పరిధిలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.  వయోపరిమితి, అర్హత, దరఖాస్తు ప్రాసెస్(Application Process) గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య  14.

డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) విభాగంలో - 02,

జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ విభాగంలో -  03,

స్టెనోగ్రాఫర్ పోస్టులు - 04,

ఎల్డీసీ పోస్టులు - 04,

Edp అసిస్టెంట్ పోస్టులు 01 ఉన్నాయి.

వయోపరిమితి-జీతం..

విభాగంవయస్సుజీతం(నెలకు)
డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) 40రూ. 47,700
జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ 30రూ. 35,400
 స్టెనోగ్రాఫర్ 27రూ. 25,500
లోయర్ డివిజన్ క్లర్క్27రూ. 19,900
Edp అసిస్టెంట్35రూ. 35,400

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : నవంబర్ 18, 2022

దరఖాస్తు చేయుటకు చివరి తేది : డిసెంబర్ 17, 2022

విద్యార్హతలు :

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. టైపింగ్ స్పీడ్ ఆంగ్లంలో 30WPM లేదా మాన్యువల్ టైప్‌రైటర్‌పై హిందీలో 25 WPM లేదా టైపింగ్ వేగం 35WPM ఆంగ్లంలో లేద కంప్యూటర్‌లో హిందీ నందు 30WPM కలిగి ఉండాలి.

స్టెనోగ్రాఫర్ – డి : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్కిల్ టెస్ట్ నార్మ్స్ డిక్టేషన్: 10 mts@ 80 w.p.m. ట్రాన్స్‌క్రిప్షన్: మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో 65 మీ. (ఇంగ్లీష్) 75 మీ. (హిందీ) 50 మీ. (ఇంగ్లీష్) 65 మీ.(హిందీ) టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (JHS) : సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా హైడ్రోగ్రఫీ లేదా ల్యాండ్ సర్వేలో 3 సంవత్సరాల అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా హైడ్రోగ్రఫీలో 7 సంవత్సరాల అనుభవంతో ఇండియన్ నేవీ యొక్క SR I/II సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

Railway Jobs: సికింద్రాబాద్ రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగాలు.. జీతం రూ.48 వేలు..

EDP ​​అసిస్టెంట్ : కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ లేదా తత్సమానం. ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మెషీన్‌పై డేటా ఎంట్రీ ఆపరేషన్స్‌లో ఏడాది అనుభవం.

డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) : చార్టెడ్ అకౌంటెంట్స్ (సీఏ) చేసి ఉండాలి. కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం లేదా సెమీ-గవర్నమెంట్ లేదా ఆర్గనైజేషన్ లేదా PSU యొక్క ఫైనాన్స్ లేదా అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లోని వాణిజ్య ఖాతాలలో సూపర్‌వైజరీ సామర్థ్యంలో 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ ఉండాలి.

దరఖాస్తు విధానం ఇలా.. 

- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

-వెబ్ సైట్ లో పేర్కొన్న విధంగా INSTRUCTIONS చదువుకోవాలి.

-అర్హత ప్రమాణాలు ఉంటే.. ప్రొసీడ్ టు రిజిస్టర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

-తర్వాత వ్యక్తిగత వివరాలను నమోదు చేసి.. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

-తర్వాత లాగిన్ లో పేర్కొన్న విధంగా వివరాలను నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

-చివరగా అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలను ఉపయోగపడుతుంది.

దరఖాస్తు కు ఫీజు  ఇలా.. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు  రూ. 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Central Govt Jobs, JOBS

ఉత్తమ కథలు