హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IT Jobs: ఆ ఐటీ కంపెనీలో ఫ్రెషర్స్‌కి 35,000 ఉద్యోగాలు

IT Jobs: ఆ ఐటీ కంపెనీలో ఫ్రెషర్స్‌కి 35,000 ఉద్యోగాలు


8.  కంపెనీ నిషేధ నిబంధ‌న‌కు వ్య‌తిరేకంగా కేంద్ర కార్మిక‌శాఖ వ‌ద్ద‌ ఎన్ఐటీఈఎస్ అధ్య‌క్షుడు హ‌ర్‌ప్రీత్ సింగ్ స‌లూజా ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ చ‌ట్టంలోని 27 సెక్ష‌న్ ప్ర‌కారం ఇన్ఫీ నిషేధ నిబంధ‌న చ‌ట్ట విరుద్ధం అని ఆరోపించారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8. కంపెనీ నిషేధ నిబంధ‌న‌కు వ్య‌తిరేకంగా కేంద్ర కార్మిక‌శాఖ వ‌ద్ద‌ ఎన్ఐటీఈఎస్ అధ్య‌క్షుడు హ‌ర్‌ప్రీత్ సింగ్ స‌లూజా ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ చ‌ట్టంలోని 27 సెక్ష‌న్ ప్ర‌కారం ఇన్ఫీ నిషేధ నిబంధ‌న చ‌ట్ట విరుద్ధం అని ఆరోపించారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

IT Jobs | ఐటీ జాబ్ మీ కలా? సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కోరుకుంటున్నారా? ఓ ఐటీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో 35,000 ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు ఇవ్వనుంది.

సాఫ్ట్​వేర్​ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 35 వేల మంది ఫ్రెషర్స్​ను క్యాంపస్​ ప్లేస్​మెంట్​ ప్రోగ్రామ్​ ద్వారా రిక్రూట్​ చేసుకోనున్నట్లు ప్రకటించింది. తొలుత 26 వేల మంది ఫ్రెషర్స్​ను రిక్రూట్​ చేసుకోవాలని భావించినప్పటికీ డిజిటల్​ కంటెంట్​కు డిమాండ్​ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సంఖ్యను గణనీయంగా పెంచింది. అందుకు అనుగుణంగా 35 వేల మందికి కొత్తగా అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యుబి ప్రవీణరావు మాట్లాడుతూ.. “గత కొంత కాలంగా ఐటీ సెక్టార్​ వేగంగా పుంజుకుంటోంది. అదేక్రమంలో డిజిటల్​ కంటెంట్​కు డిమాండ్​ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా 35 వేల మంది ఫ్రెషర్స్​ను రిక్రూట్​ చేసుకోవాలని భావిస్తున్నాం. నేరుగా కాలేజీలకు వెళ్లి క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ ద్వారా 35 వేల మంది ఫ్రెష్​ గ్రాడ్యుయేట్లను రిక్రూట్​ చేసుకుంటాం. వీరి ద్వారా ప్రస్తుత డిమాండ్‌ను చేరుకోవాలని ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు.

Coast Guard Jobs 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 350 జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Post Office Jobs: టెన్త్, ఇంటర్ పాసైనవారికి పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు... రూ.81,000 వరకు జీతం

కాగా, 2021 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో వాలంటరీ అట్రిషన్ రేటు (ఉద్యోగ వలసలు) 13.9 శాతానికి పెరిగిందని తెలిపారు. కాగా, గత త్రైమాసికంలో ఇది 10.9 శాతంగా ఉండేది. అయితే, కిందటి ఏడాది జూన్​ క్వార్టర్​తో పోలిస్తే (15.6 శాతం) మాత్రం ఈ అట్రిషన్​ రేటు తగ్గింది. కాగా, 2020–21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 21,000 మందిని నియమించుకుంది. 2021 జూన్​తో ముగిసిన త్రైమాసికంలో 8000 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకుంది. దీంతో, ప్రస్తుతం ఇన్ఫోసిస్​ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.67 లక్షలకు చేరుకుంది.

AP Jobs 2021: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 319 ఉద్యోగాలు... 3 రోజులే గడువు

SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎస్‌బీఐలో 6100 జాబ్స్... అప్లై చేయండి ఇలా

ఇన్ఫోసిస్​ లాభాలు పైపైకి


ఇన్ఫోసిస్ తాజాగా తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. 22.7 శాతం ఏకీకృత నికర లాభాలను నమోదు చేసి రూ.5,195 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో రూ. 4,233 కోట్ల లాభాలనే గడించింది. ఈ లెక్క ప్రకారం గతేడాదితో పోలిస్తే ఇన్ఫోలిస్​ లాభాలు 2.3 శాతం మేర పెరిగాయి. కంపెనీ ఆదాయం 17.89 శాతం వృద్ధి చెంది రూ. 27,896 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 23,665 కోట్ల ఆదాయ వృద్ధి నమోదైంది. గత మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం ఆరు శాతం పెరిగింది.

First published:

Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Infosys, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

ఉత్తమ కథలు