హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(Hindustan Aeronautics Limited), కొర్వా, అమేథి ఏరియానిక్స్ డివిజన్‌లో ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఇవే..
విద్యార్హతలు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కాస్ట్ & వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చట్టం -1959 కింద ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ & వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నుంచి CMA (ఇంటర్మీడియట్) కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం..
ఈ పోస్టు ఎంపిక కేవలం మెరిట్(Merit) ఆధారంగా చేస్తారు. CMA (ఇంటర్మీడియట్) పరీక్షలో 1 వ మరియు 2 వ గ్రూప్‌లో సాధించిన మొత్తం అగ్రిగేట్(Agrigate) మార్కుల 100% వెయిటేజీగా తీసుకోని అభ్యర్థి ఎంపిక చేస్తారు.
శిక్షణా కాలం..
ఈ పోస్టులకు ఎంపికైన వారు ట్రైనీ పిరియడ్(Trainee period) ప్రారంభమైన తేదీ నుంచి రెండు సంవత్సరాలు ట్రైనింగ్(Training) ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు అక్టోబర్ 12, 2021న హెచ్ఏఎల్ వెబ్‌సైట్(www.hal-india.co.in)లోని కేరీర్(Career) విభాగంలో తెలుపుతారు. అనంతరం వ్యక్తిగతంగా వారి ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపుతారు. ఎంపికకు సంబంధించిన అన్ని కమ్యూనికేషన్(Communications)లు ఈ-మెయిల్ ద్వారానే చేస్తారు. అందుకోసం అభ్యర్థి సరైన ఈ-మెయిల్‌ను అందించాలి.
దరఖాస్తు చేసుకొనే విధానం..
- దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థి ముందుగా దరఖాస్తుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ప్రింట్ తీసి పెట్టుకోవాలి. (దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి)
- అవసరమై డాక్యుమెంట్లు ఇవే.. CMA (ఇంటర్మీడియట్) గ్రూప్ వారీగా మార్క్ షీట్, ఆధార్ కార్డ్
- ఈ డాక్యుమెంట్ల హార్డు కాపీలకు దరఖాస్తును జత చేసి పోస్టు చేయాలి.
- పోస్టు లెటర్ మీద తప్పకుండా “Senior Manager (Training)” అని కచ్చితంగా రాయాలి.
- పంపాల్సిన అడ్రస్ - HAL, Avionics Division, Korwa, Amethi-227412 (U.P.)
- స్పీడ్ పోస్టు ద్వారా మీ దరఖాస్తు స్వీకరిస్తారు. అందుకు చివరి తేదీ: సెప్టెంబర్ 25, 2021 (సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం)
దరఖాస్తు చేసుకొనే వారికి ముఖ్యమైన సూచనలు..
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వచ్చే అభ్యర్థులకు సంస్థ నుంచి టీఏ/డీఏ(TA/DA) లు అభించవు.
- శిక్షణా కాలం ముగిసిన వెంటనే ఒప్పందం ముగుస్తుంది. అనంతరం హెచ్ఏఎల్(HAL) నుంచి ఎటువంటి ఉపాధి హామీ లభించదు. నోటిఫికేషన్ ప్రకటనను, ఎంపిక ప్రక్రియను ఎప్పుడైన రద్దు చేసే హక్కు ఉంటుంది.
- అభ్యర్థుల ఎంపిక తుది నిర్ణయం హెచ్ఏఎల్ యాజమాన్యానిదే. దరఖాస్తు ఫామ్‌లో ఎటువంటి తప్పుడు సమాచారం అందించినా అభ్యర్థిని ఏ క్షణమైన తొలగించే అవకాశం హెచ్ఏఎల్‌కు ఉంటుంది. దరఖాస్తు దారులు ఏ రూపంలో నైన ఎంపిక ప్రక్రయకు విరుద్ధంగా వ్యహరిస్తే వారిని ఎంపిక చేయరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs