అగ్నివీర్(Agniveer) పోస్టులకు దరఖాస్తు(Application) చేసుకోవడానికి అర్హత లేని వారికి ఐటీబీపీ శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో(Notification) పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ పలు పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సబ్ ఇన్‌స్పెక్టర్ స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఇక్కడ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022. ఆగస్టు 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్ స్టాఫ్ నర్స్ పోస్టులన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు.. అభ్యర్థులు జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో కనీస అనుభవం కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
వీటికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడవ పీఆర్సీ ప్రకారం.. జీతం రూ. 35,400 నుంచి రూ. 1,12,400 మధ్య చెల్లిస్తారు. మొత్తం 18 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీనిలో జనరల్ కేటగిరీ కింద 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కోటా కింద 02, ఓబీసీ కింద 02, ఎస్సీ 01, ఎస్టీకు 02 పోస్టులను కేటాయించారు.
అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 16 సెప్టెంబర్ 1992 నుంచి 16 సెప్టెంబర్ 2001 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..
ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ / రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. దరఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ, ఎస్టీ , మహిళలు, మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి recruitment.itbpolice.nic.in లింక్‌పై క్లిక్ చేయండి . ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి వెబ్ సైట్ లింక్ అనేది ఆగస్టు 17 న ఆక్టివేట్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army jobs, Career and Courses, Central Government Jobs, Itbp, JOBS