IGNOU Admissions: ఇగ్నోలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు... జనవరి 31 లోగా అప్లై చేయండి

IGNOU Admission 2020 January Session | ఇగ్నోలో 6 నెలల సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లాంటి కోర్సులున్నాయి.

news18-telugu
Updated: January 29, 2020, 12:34 PM IST
IGNOU Admissions: ఇగ్నోలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు... జనవరి 31 లోగా అప్లై చేయండి
IGNOU Admissions: ఇగ్నోలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు... జనవరి 31 లోగా అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయినా చదువును కొనసాగించాలనుకుంటున్నారా? మీలాంటివారి కోసం ఓపెన్ యూనివర్సిటీలు మంచి విద్యావకాశాలను అందిస్తుంటాయి. అలాంటి విశ్వవిద్యాలయాల్లో ఒకటి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU. ఇటీవలే జనవరి 2020 సెషన్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువును జనవరి 31 వరకు పొడిగించింది ఇగ్నో. ఇందులో 6 నెలల సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లాంటి కోర్సులున్నాయి. ప్రతీ ఏటా రెండు సార్లు అడ్మిషన్లను స్వీకరిస్తుంది ఇగ్నో. జనవరితోపాటు జూలైలో అడ్మిషన్లు ఉంటాయి. ప్రస్తుతం జనవరి సెషన్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కోర్సుల వివరాలు, అడ్మిషన్లకు సంబంధించిన సమాచారం కోసం https://ignouadmission.samarth.edu.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

IGNOU Admission 2020 January Session: ఇగ్నోలో కోర్సులకు అప్లై చేయండి ఇలా...


ముందుగా https://ignouadmission.samarth.edu.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Prospectus Jan 2020 డౌన్‌లోడ్ చేసుకొని వివరాలన్నీ చదవండి. ప్రాస్పెక్టస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రాస్పెక్టస్ చదివిన తర్వాత మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయండి.


దరఖాస్తు ఫామ్‌ను ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.29 మాస్టర్స్ డిగ్రీ, 19 బ్యాచిలర్స్ డిగ్రీ, 61 డిప్లొమా, 80 సర్టిఫికెట్ కోర్సుల్ని అందిస్తోంది ఇగ్నో. డిజిటల్ స్టడీ మెటీరియల్ కోరుకునేవారికి అడ్మిషన్ ఫీజులో 15% డిస్కౌంట్ లభిస్తుంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 సచివాలయ ఉద్యోగాలకు ఎగ్జామ్ సిలబస్ ఇదే

Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

Railway Jobs: రైల్వేలో మరో 2792 ఖాళీలకు నోటిఫికేషన్... వివరాలివే
First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు