ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ జర్నలిజం(Journalism) మరియు న్యూ మీడియా స్టడీస్(New Media Studies) ద్వారా మూడు భాషల్లో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సులు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడతాయి. ఈ కోర్సులు ఇంగ్లీష్, హిందీ మరియు తమిళం అనే మూడు భాషలలో నడుస్తాయి. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ignouiop.samarth.edu.in లేదా IGNOU సమర్థ్ అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు నమోదు చేసుకోవడానికి ఇక్కడ పేర్కొన్న దశలను అనుసరించవచ్చు.
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుల వ్యవధి 1 సంవత్సరం. ఈ కోర్సు కోసం అభ్యర్థులు రూ.12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇగ్నో విడుదల చేసిన నోటీస్ ప్రకారం.. వర్చువల్ లాంచ్‌లో ఇగ్నో వీసీతో పాటు విభాగాధిపతి కూడా ఉన్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
దరఖాస్తు చేసుకోండిలా..
Step 1: ముందుగా అభ్యర్థులందరూ ignouiop.samarth.edu.inలో IGNOU సమర్థ్ అధికారిక సైట్‌ని సందర్శించండి.
Step 2: ఆ తర్వాత జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ కోసం పీజీ డిప్లొమా లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత కొత్త పేజీ Open అవుతుంది. అక్కడ అభ్యర్థి సైన్ ఇన్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.
Step 4: ఆ తర్వాత అభ్యర్థి రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
Step 5: ఇక్కడ దరఖాస్తు ఫీజు చెల్లించి.. అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
Step 6: చివరగా అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసి.. ప్రింట్ తీసుకోండి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IGNOU, IGNOU TEE, JOBS