ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo airlines) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఇండిగో రిక్రూట్‌మెంట్ (Recruitment) కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ goindigo.app.param.ai ను సందర్శించాలి. ఈ వెబ్‌లింక్ ద్వారా పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ (Electronics), మెకానికల్ లేదా ఏరోనాటికల్ (Aeronautical) విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత ప్రమాణాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ ఏరోనాటికల్ విభాగాల్లో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. పదోతరగతి, ఇంటర్మీడియట్, బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
Engineering : ఇంజనీరింగ్ చేయాలనుకొంటున్నారా.. దేశంలో, విదేశాల్లో టాప్ 15 కళాశాలలు ఇవే..
ఎంపికైన వారు చేపట్టాల్సిన విధులు..
- ఇండిగో ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కొన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..
- ఎంపికైన వారు ఎయిర్‌క్రాఫ్ట్ రూటింగ్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండింగ్ సమయంలో మెయింటెనెన్స్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వేర్‌హౌస్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ఫ్రంట్ లైన్ సపోర్ట్ విధులు, విమాన భాగాల మరమ్మతుతో పాటు నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి.
- మెటీరియల్స్, స్పేర్స్, టూల్స్, ఎక్విప్‌మెంట్ ప్లాన్ అండ్ ప్రొవిజనింగ్‌తో పాటు విడిభాగాల సేకరణ, లాజిస్టిక్స్ సపోర్ట్ అందించాలి. ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్, సి-చెక్‌తో సహా దీర్ఘకాలిక ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతను నిర్వహించాలి. ఇన్సూరెన్స్, వారంటీ, బడ్జెటింగ్, కాస్ట్ కంట్రోల్.
కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్, లోకల్ / ఫారన్ విక్రేతలను అనుసంధానించండం, ప్రత్యేక ప్రాజెక్ట్‌లు / అధ్యయనాలు / సిస్టమ్స్, ప్రొసీజర్లను అమలు చేయడం... వంటి బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
కరోనా నష్టాల నుంచి కోలుకున్న ఇండిగో..
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 2021–22 సెప్టెంబర్ త్రైమాసికంలో ₹1,435 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎయిర్‌లైన్స్ సేవలను పునరుద్దరించింది. దీంతో ఈ త్రైమాసికంలో ఆదాయం 91.4 శాతం పెరిగి రూ. 5,798 కోట్లకు చేరుకుందని ఇండిగో సీఈఓ రొనోజాయ్ దత్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే కోవిడ్-19 సంక్షోభం నుంచి ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు బయటపడినట్లు కనిపిస్తోందని అభిప్రాయయపడ్డారు. అయితే కోవిడ్ సంక్షోభంతో పాటు విమానయాన టర్బైన్ ఇంధనం (ATF) ధరల పెరుగుదలతో ఎయిర్‌లైన్ ఖర్చులు మరింత పెరిగాయి. ఈ కారణంగానే 2021–-22 మొదటి త్రైమాసికంలో రూ. 3,174 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IndiGo, Job notification, JOBS