INDIAS TOY MARKET EXPANDING AND CREATING NEW JOBS WITH AATMANIRBHAR BHARAT INITIATIVE SS GH
Indian Toys Market: ఆటబొమ్మల తయారీ కేంద్రంగా భారత్... ఉద్యోగాల కల్పన, ఆత్మనిర్భర భారత్ కల సాకారం
Indian Toys Market: ఆటబొమ్మల తయారీ కేంద్రంగా భారత్... ఉద్యోగాల కల్పన, ఆత్మనిర్భర భారత్ కల సాకారం
(ప్రతీకాత్మక చిత్రం)
Indian Toys Market | ఆటబొమ్మల తయారీలో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆటబొమ్మల పరిశ్రమలో (toy industry) మార్కెట్లో వాటాను భారత్ క్రమంగా పెంచుకుంటోంది.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ఆటబొమ్మల తయారీ రంగం క్రమంగా సాకారం చేస్తోంది. 2020 నాటికి భారతీయ ఆట బొమ్మల పరిశ్రమ మార్కెట్ వాటా 1.23 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2021-2026 నాటికి ఇది 12.2 శాతం వార్షిక వృద్ధి రేటులో పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ రంగంలో చైనా బలంగా ఉంది. ఇప్పటికీ భారత్ దిగుమతి చేసుకుంటున్న ఆట బొమ్మల్లో చైనా వాటా 70 శాతం వరకు ఉంది. ఈ నేపథ్యంలో దిగుమతులను తగ్గిస్తూ, దేశీయ తయారీని పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో పేర్కొన్నారు.
ఈ పరిశ్రమ వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మన దేశంలో మొదటిసారి ఇండియా టాయ్ ఫెయిర్ జరిగింది. కార్యక్రమాన్ని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ రంగం మరింత వృద్ధిని నమోదు చేయాలని ఆయన ఆకాంక్షించారు. వెయ్యి వరకు వర్చువల్ స్టాల్స్, రాష్ట్ర ప్రభుత్వాల వెబినార్లు, నిపుణుల నాలెడ్జ్ సెషన్లను టాయ్ ఫెయిర్‌లో ఏర్పాటు చేశారు.
భారత్‌లో తయారయ్యే ఆట బొమ్మలను పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలతో తయారు చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. వీటి తయారీలో ప్లాస్టిక్ వినియోగాన్ని తక్కువ చేయడంతో పాటు రీసైకిల్ చేయగల ఉత్పత్తులను వాడాలని తయారీదారులను కోరారు. ప్రస్తుతం దేశంలో చాలా స్టార్టప్‌లు ఆటబొమ్మల తయారీని చేపట్టి మంచి లాభాలను సాధిస్తున్నాయి. దేశీయంగా వీటిని తయారు చేస్తూ సుస్థిరాభివృద్ధికి ఈ సంస్థలు కృషి చేస్తున్నాయి. చెన్నైకి చెందిన అరిరో వుడెన్ టాయ్స్ సంస్థను వసంత్ తమిళ్ సెల్వన్ అనే వ్యక్తి 2020లో స్థాపించారు. ఇక్కడ వేప చెక్కలతో కొయ్య బొమ్మలను తయారు చేస్తారు. ప్లాస్టిక్ బొమ్మల దుష్ప్రభావాలను ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. దీంతో పిల్లలకు హాని చేయని కొయ్య బొమ్మలను కొనేందుకుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారని వసంత్ చెబుతున్నారు. ఇప్పటికే తమ సంస్థకు 10,000 ఆర్డర్లు వచ్చాయని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.2.5 కోట్ల టర్నోవర్ సాధించడం విశేషం.
ముంబైకి చెందిన దేశీ టాయ్స్ అనే మరో సంస్థ కూడా కేవలం కొయ్యబొమ్మలనే తయారుచేస్తోంది. వీటి కొనుగోళ్లు పెరగడంతో దీని వ్యవస్థాపకులు ముంబైలోని అతిపెద్ద సప్లై చైన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ కంపెనీల నుంచి కూడా ఇలాంటి స్టార్టప్‌లకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుండటం వల్ల ఈ పరిశ్రమ మార్కెట్ వాటా రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని తయారీదారులు చెబుతున్నారు. IKEA సంస్థ కూడా భారతదేశం నుంచి ఆట బొమ్మలను సేకరిస్తామని ప్రకటించింది. వీటి అమ్మకాల్లో 13 శాతం కంటే ఎక్కువ వృద్ధి సాధించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
* పెద్ద కంపెనీల ఆసక్తి
కర్ణాటకలోని కొప్పల్‌లో Aequs సంస్థ ఏకంగా 400 ఎకరాల్లో బొమ్మల తయారీ క్టస్టర్‌ను ఏర్పాటు చేసింది. ఆటబొమ్మల తయారీలో ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొప్పల్‌లో ఈ సంస్థకు 400 ఎకరాల క్లస్టర్ ఉండగా.. దీంట్లో 300 ఎకరాలను కేవలం ఎగుమతులకోసం సెజ్;గా మార్చారు. దీంట్లో కెంపెనీ ఏకంగా 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం విశేషం. అంటే ఆటబొమ్మల తయారీపై కంపెనీ లక్ష్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బొమ్మల తయారీదారులు, సప్లయర్లతో ఈ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దీని వల్ల 25,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1,00,000 పరోక్ష ఉద్యోగాల కల్పనకు వీలు కలుగుతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత ఆటబొమ్మల తయారీ పరిశ్రమ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వృద్ధిని నమోదు చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.