Parle G: పార్లే-జీకి తగ్గిన డిమాండ్... 10,000 మంది ఉద్యోగాలకు గండం

Parle G | పార్లే-జీతో ఇంటింటికీ అనుబంధం ఏర్పడింది. 2003లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న బ్రాండ్‌గా పార్లే-జీకి పేరు వచ్చింది.

news18-telugu
Updated: August 21, 2019, 3:52 PM IST
Parle G: పార్లే-జీకి తగ్గిన డిమాండ్... 10,000 మంది ఉద్యోగాలకు గండం
Parle G: పార్లే-జీకి తగ్గిన డిమాండ్... 10,000 మంది ఉద్యోగాలకు గండం (News18 Creative by Mir Suhail)
news18-telugu
Updated: August 21, 2019, 3:52 PM IST
పార్లే జీ... పరిచయం అక్కర్లేని బిస్కెట్ బ్రాండ్. పార్లే జీ బిస్కెట్లు తిననివారుండరు. పేద, మధ్యతరగతి ప్రజలకు, పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్లకు విడదీయరాని బంధం ఉందన్నది వాస్తవం. 9 దశాబ్దాల చరిత్రగల పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సంక్షోభం నెలకొంది. ఆర్థిక వృద్ధి మందగించింది. పార్లే ఉత్పత్తులకు గుండెకాయ లాంటి గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ తగ్గిపోయింది. దీంతో అమ్మకాలు పడిపోయాయి. ఉత్పత్తి కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కంపెనీపై పడుతున్న భారాన్ని కూడా తగ్గించే ఆలోచనలో ఉంది పార్లే. ఏకంగా 10,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోంది. 10,000 మంది ఉద్యోగుల్ని తొలగించే ఆలోచనలో ఉన్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించడం ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది.

పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే మేం ఉద్యోగుల్ని తొలగించే పరిస్థితి నెలకొంది. పార్లే బిస్కెట్ అమ్మకాలు పడిపోయాయి. దీంతో ఉత్పత్తి తగ్గించాల్సి వచ్చింది. ఈ కారణంగా 8,000-10,000 మంది ఉద్యోగుల్ని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది.
మయాంక్ షా, కేటగిరీ హెడ్, పార్లే


Parle employees, parle biscuits, parle g, Parle Products Pvt Ltd, Goods and services tax, GST on biscuits, jobs, indian economy, Parle layoff, పార్లే ఉద్యోగులు, పార్లే బిస్కిట్స్, పార్లే జీ, పార్లే ప్రొడక్ట్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, బిస్కెట్లపై జీఎస్టీ, ఉద్యోగాలు, భారతదేశ ఆర్థిక పరిస్థితి, పార్లే ఉద్యోగాల కోత
ప్రతీకాత్మక చిత్రం




పార్లే కంపెనీ 1929 లో ప్రారంభమైంది. సరిగ్గా 90 ఏళ్ల చరిత్ర. కంపెనీకి చెందిన 10 యూనిట్లు, 125 కాంట్రాక్ట్ ప్లాంట్స్‌లో 1,00,000 మంది ఉద్యోగులున్నారు. కొంతకాలంగా పార్లే అమ్మకాలు తగ్గుతున్నాయి. పార్లే కంపెనీకి పార్లే-జీ బిస్కెట్‌తో పేరొచ్చింది. మొదట పార్లే గ్లూకో పేరులో ఈ బిస్కెట్ ప్యాకెట్ పరిచయమైంది. ఆ తర్వాత పార్లే-జీగా పేరు మార్చారు. 1980, 1990 దశకంలో పార్లే-జీ బిస్కెట్ బాగా పాపులర్ అయింది. పార్లే-జీతో ఇంటింటికీ అనుబంధం ఏర్పడింది. 2003లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న బ్రాండ్‌గా పార్లే-జీకి పేరు వచ్చింది.

ఇంత ఘన చరిత్రకు కారణమైన పార్లే కంపెనీ కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది. 2017 లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GST అమలు చేసిన తర్వాత బిస్కెట్ ధరలు పెంచాల్సి వచ్చింది. పన్నులను సమీక్షించాలంటూ జీఎస్‌టీ కౌన్సిల్‌తో పాటు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పార్లే యాజమాన్యం చర్చలు కూడా జరిపింది. బిస్కెట్ ప్యాకెట్ల ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. పార్లే ఆదాయంలో సగం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటుంది. రూరల్ నుంచి పార్లే బిస్కెట్లకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. దానికి తోడు ఇటీవల అన్నిరంగాల్లో ఆర్థిక వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. పార్లే పైనా ఆ ప్రభావం పడింది.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి
Loading...

ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా లోన్స్

Aadhaar Link: ఫేస్‌బుక్, వాట్సప్ అకౌంట్లతో ఆధార్ లింక్ చేయాలా?

IRCTC: తిరుమల వెళ్లాలా? ఐఆర్‌సీటీసీ నుంచి ప్రతీ రోజూ టూర్ ప్యాకేజీ
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...