హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో ఉద్యోగాలు... బీఈ పాసైనవారికి ఈ జాబ్స్

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో ఉద్యోగాలు... బీఈ పాసైనవారికి ఈ జాబ్స్

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో ఉద్యోగాలు... బీఈ పాసైనవారికి ఈ జాబ్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో ఉద్యోగాలు... బీఈ పాసైనవారికి ఈ జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Bounce | ప్రైవేట్ ఉద్యోగాలు కోరుకునేవారికి అనేక ఉద్యోగావకాశాలు వస్తుంటాయి. మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ అయిన బౌన్స్‌లో (Bounce) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది.

భారతదేశంలో మొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ అయిన బౌన్స్‌లో (Bounce) ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని కంపెనీ భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు వేర్వురుగా ఉద్యోగ ప్రకటనల్ని (Job Notifications) విడుదల చేసింది. అభ్యర్థులు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. కొన్ని పోస్టులకు అర్హతలతో పాటు అనుభవం కూడా తప్పనిసరి. ఆపరేషన్స్ విభాగంలో ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల వివరాలన్నీ పూర్తిగా చదివిన తర్వాత ఇమెయిల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. బౌన్స్‌లో ఆపరేషన్స్ విభాగంలో ఇంజనీర్ పోస్టులకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసుకోండి.

విద్యార్హతలివే...


డిపార్ట్‌మెంట్- ఆపరేషన్స్

పోస్టు పేరు- ఇంజనీర్

రిపోర్టింగ్ మేనేజర్ హోదా- బ్యాటరీ ఆపరేషన్స్ లీడ్

ప్రాంతం- బెంగళూరు

విద్యార్హతలు- బ్యాచిలర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (ఈసీ, మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్)

అనుభవం- 2 నుంచి 3 ఏళ్లు

విధులు- రియల్ టైమ్‌లో ఫీల్డ్‌లోని బౌన్స్ స్కూటర్‌ల బ్యాటరీ, ఛార్జర్, ఇతర పారామీటర్స్ పరిశీలించాలి. ఏవైనా లోపాలు ఉంటే సమస్యల్ని సంబంధిత విభాగానికి తెలియజేయాలి.

కావాల్సిన స్కిల్స్- ఎలక్ట్రిక్ వెహికిల్ రంగంలో జనరల్, బ్యాటరీ, ఛార్జర్ లాంటి విభాగాల్లో పనిచేసిన అనుభవం, పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులు బ్యాటరీ, ఛార్జర్, వాహనానికి సంబంధించిన పనితీరు, హెల్త్, సేఫ్టీ లాంటి బేసిక్ పారామీటర్స్ అర్థం చేసుకోగలగాలి. ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ తెలిసి ఉండాలి.

దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ- careers@bounceshare.com

IBPS Clerk 2022: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 జాబ్స్... అప్లై చేయండి ఇలా

బాధ్యతలు


1. రియల్ టైమ్‌లో బ్యాటరీలు, ఛార్జర్లు, వాహనాల పారామీటర్స్ పర్యవేక్షించాలి.

2. బ్యాటరీలు, ఛార్జర్లలోని లోపాలు గుర్తించి రిపోర్ట్ చేయాలి.

3. బ్యాటరీ, ఛార్జర్ పారామీటర్స్ ఆధారంగా రాబోయే సమస్యల్ని గుర్తించి ఆపరేషన్ లీడ్స్‌కు నివేదించాలి.

4. ఫీల్డుకి వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యల్ని గుర్తించి, తీసుకోవాల్సిన చర్యల్ని వివరించాలి.

5. ఏవైనా జరగబోయే ఘటనల్ని ముందుగానే గుర్తించి చర్యల్ని సూచించాలి.

6. బ్యాటరీ, ఛార్జర్ ప్యారామీటర్ల లాగ్స్ మెయింటైన్ చేయాలి.

జాబ్ డిస్క్రిప్షన్


మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ బౌన్స్ 2018 మే లో ప్రారంభమైంది. వివేకానంద హల్లికేరి, అనిల్ జీ, వరుణ్ అగ్ని మానసపుత్రికే బౌన్స్ స్టార్టప్. రోజువారీ ప్రయాణం ఒత్తిడి లేకుండా, వేగంగా, నమ్మకంగా, సౌకర్యవంతంగా చేసే లక్ష్యంతో బౌన్స్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌గా ప్రారంభించబడింది. రైడ్-షేరింగ్ అవతార్‌తో, వివిధ రోజువారీ ప్రయాణికుల కోసం సరసమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. సుదూర ప్రాంతాలను కవర్ చేయడం నుంచి లాస్ట్ మైల్ సపోర్ట్ వరకు అన్ని అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది.

Jobs in TCS: బీఏ, బీకామ్ పాసయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా


బెంగళూరులో మొదట లాంఛైనా ఆ తర్వాత కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాలకు విస్తరించింది. మొదటి ఏడాదిలోనే 30,000 పైగా స్కూటర్లతో రోజుకు 1,00,000 పైగా రైడ్స్ చేయడం విశేషం. రోజూ లక్షకు పైగా ట్రాన్సాక్షన్స్‌తో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందిన స్టార్టప్‌గా ఎదగడం విశేషం. మొదటి 11 నెలల్లోనే 500 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యాల్యుయేషన్ చేరుకుంది. షేరింగ్ మొబిలిటీ బిజినెస్‌ను విస్తరిస్తూ, బౌన్స్ జ్యూనిక్‌లో ఇన్వెస్ట్ చేసింది. బౌన్స్ ఇన్ఫినిటీ పేరుతో భారతదేశంలోనే మొదటి స్వాపబుల్ బ్యాటరీ గల ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది.

First published:

Tags: Bounce, JOBS, Private Jobs

ఉత్తమ కథలు