Home /News /jobs /

INDIAN WOMEN SMARTPHONE USERS SPEND MORE TIME ON EDUCATION FINANCE APPS SURVEY GH VB

App Survey: ఆ యాప్స్ లను ఎక్కువగా వినియోగిస్తున్న మహిళా యూజర్లు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పురుషులు, మహిళలు ఎలాంటి మొబైల్ యాప్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారనే అంశంపై Bobble AI అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ రిపోర్టు వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఏవంటే..

ఓ సంస్థ నిర్వహించిన సర్వే(Survey) ద్వారా మహిళలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. క్షేత్రస్థాయిలో వస్తున్న మార్పులను సర్వే రిపోర్టు వివరించే ప్రయత్నం చేసింది. పురుషులు, మహిళలు(Women's) ఎలాంటి మొబైల్ యాప్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారనే అంశంపై Bobble AI అనే సంస్థ సర్వే నిర్వహించింది. భారతదేశంలోని మహిళలు ఎక్కువగా ఫైనాన్స్‌(Finance), ఎడ్యుకేషన్‌(Education) యాప్స్‌ను(Apps0 వినియోగిస్తున్నారని, సాధారణంగా ఈ రెండు విభాగాల అప్లికేషన్లను ఎక్కువగా పురుషులు వినియోగిస్తుంటారని పేర్కొంది. నెలకు ఫైనాన్స్‌, ఎడ్యుకేషన్‌ అప్లికేషన్లకు సరాసరిగా యూజర్లు ఎంత సమయం కేటాయిస్తున్నారనే అంశంపైనా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

2020 ఫిబ్రవరి నెలలో ఫైనాన్స్‌ అప్లికేషన్లపై యూజర్లు స్పెండ్ చేస్తున్న సమయం రెండు గంటలుగా ఉంది. యావరేజ్‌గా గంటకుపైగా సమయాన్ని ఎడ్యుకేషన్‌ యాప్‌లకు కేటాయిస్తున్నారు. వాస్తవానికి అన్ని విభాగాలకంటే ఫైనాన్స్‌, ఎడ్యుకేషన్‌ విభాగాల వాటా మార్కెట్‌లో తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా ఫోన్లు ఉపయోగిస్తున్న మహిళలు ఎక్కువగా ఫైనాన్స్‌, ఎడ్యుకేషన్‌ యాప్‌లను వినియోగిస్తున్నారు. పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపుతున్నారని, ఆర్థికపరంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని మహిళలు భావిస్తున్నట్లు సర్వే రిపోర్టు పేర్కొంది. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమైన తర్వాత ఎడ్యుకేషన్‌ యాప్‌లను కూడా మహిళలు ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపింది.

Women Empowerment: మహిళా సాధికారతకు ‘అప్‌గ్రాడ్’ విద్యాశక్తి స్కాలర్‌షిప్‌‌లు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలు..


ఆరు కీలక విభాగాలకు సంబంధించి ఫోన్‌ వినియోగిస్తున్న మహిళల వివరాలను నిర్వాహకులు సేకరించారు. ఈ కామర్స్‌, బ్యూటీ, ఫ్యాషన్‌ ఈ కామర్స్‌, హెల్త్‌ అండ్‌ ఫిట్నెస్‌, ఫైనాన్స్‌, ఎడ్యుకేషన్‌ యాప్‌లను వినియోగిస్తున్న మహిళల వివరాలు పరిశీలించారు. ఇండియాలోని దాదాపు 640 నగరాలలో ఫోన్‌ వినియోగిస్తున్న దాదాపు 50 మిలియన్‌ మహిళలను సర్వే చేశారు. ఈ కామర్స్‌ అప్లికేషన్లపై మహిళలు 42 నిమిషాలు స్పెండ్ చేస్తున్నారని.. బ్యూటీ యాప్స్‌పై 19 నిమిషాలు, ఫ్యాషన్‌ ఈ కామర్స్‌ యాప్స్‌పై 25 నిమిషాలు,హెల్త్‌ అండ్‌ ఫిట్నెస్‌ యాప్స్‌పై 20 నిమిషాలు ఖర్చు చేస్తున్నారని సర్వే రిపోర్ట్ పేర్కొంది.

Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి... ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఈ నివేదికపై Bobble AI చీఫ్ డేటా అండ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌ తాబ్రెజ్‌ ఆలం మాట్లాడుతూ.. ‘ఫైనాన్స్‌, ఎడ్యుకేషన్‌ అప్లికేషన్లను వినియోగించే మహిళల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది. భారతదేశంలో క్షేత్రస్థాయిలో వస్తున్న సామాజిక మార్పులకు ఇది ఉదాహరణ. మహిళలలు పెర్సనాలిటీ, జీవన విధానంపై మాత్రమే కాకుండా.. ఫైనాన్స్‌, ఎడ్యుకేషన్‌, భవిష్యత్తు, అభివృద్ధి, ఆర్థిక స్వతంత్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సర్వే ద్వారా స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న మహిళలు దేనిపై ఆసక్తి చూపుతున్నారనే విషయాలు బయటకువచ్చాయి. దీనిద్వారా ఆయా కంపెనీలు మహిళలకు అవసరమైన కోణంలో ఆలోచించి లబ్ధిపొందవచ్చు. సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన విషయాలపై నివేదికలు అందిస్తామని, వ్యాపార అభివృద్ధికి, ఇతర నిర్ణయాలు తీసుకొనేందుకు సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని చెప్పారు.

రెండు అతి పెద్ద ఈ కామర్స్‌ కంపెనీలకు ఉన్న మహిళా వినియోగదారుల వివరాలను పరిశీలిస్తే.. 2022 ఫిబ్రవరి నెలలో కొత్తగా చేరిన మహిళా యూజర్ల సంఖ్యలో అమెజాన్‌ కంటే ఫ్లిప్‌కార్ట్‌ ముందు ఉంది. 65.6 శాతం మంది కొత్త మహిళా యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో అకౌంట్లు క్రియేట్‌ చేశారు. ఈ సంఖ్య అమెజాన్‌లో 34.4 శాతంగా ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Market, Mobile phone, Womens

తదుపరి వార్తలు