ISRO Jobs: ఇస్రోలో 327 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

ISRO Recruitment 2019 | మరో 327 పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులివి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో.

news18-telugu
Updated: November 2, 2019, 9:51 AM IST
ISRO Jobs: ఇస్రోలో 327 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
ISRO Jobs: ఇస్రోలో 327 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం, image: isro.gov.in)
  • Share this:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తలు కావాలనుకునేవారికి శుభవార్త. 327 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇస్రో. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఈ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 4 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం https://www.isro.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి. ఇస్రో జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ISRO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 327

సైంటిస్ట్ / ఇంజనీర్ 'SC' (ఎలక్ట్రానిక్స్)- 131
సైంటిస్ట్ / ఇంజనీర్ 'SC' (మెకానికల్)- 135
సైంటిస్ట్ / ఇంజనీర్ 'SC' (కంప్యూటర్ సైన్స్)- 58


సైంటిస్ట్ / ఇంజనీర్ 'SC' (ఎలక్ట్రానిక్స్) అటానమస్ బాడీ- 3
Loading...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 4
విద్యార్హత- బీఈ లేదా బీటెక్‌ ఫస్ట్ క్లాస్‌ళో పాస్ కావాలి. కనీసం 65% మార్కులు లేదా CGPA 6.84/10 ఉండాలి.
వయస్సు- 35 ఏళ్ల లోపు.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: టెన్త్, ఐటీఐ అర్హతతో భారతీయ రైల్వే సంస్థలో 374 జాబ్స్... ఖాళీల వివరాలివే

Ordnance Factory Jobs: రక్షణ శాఖకు చెందిన సంస్థలో 4,805 పోస్టులు... వివరాలివే

Volunteer Jobs: గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం
First published: November 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...