• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN SPACE RESEARCH ORGANISATION ISRO INVITES APPLICATIONS FOR TECHNICIAN B DRAUGHTSMAN AND TECHNICAL ASSISTANT POSTS APPLY BEFORE SEPTEMBER 13 SS

ISRO Jobs: ఇస్రోలో 86 జాబ్స్... దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ

ISRO Jobs: ఇస్రోలో 86 జాబ్స్... దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ

ISRO Jobs: ఇస్రోలో 86 జాబ్స్... దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

ISRO Recruitment 2019 | దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

  • Share this:
    చంద్రయాన్ ప్రయోగంతో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO పేరు మార్మోగిపోయింది. మరి మీరుకూడా ప్రతిష్టాత్మక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? టెక్నీషియన్ బీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో ఈ నియామక ప్రక్రియ జరగబోతోంది. మొత్తం 86 ఖాళీలున్నాయి. టెక్నీషియన్ బీ పోస్టులు 39, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ బీ పోస్టులు 12, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 35 ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పలు పోస్టుల భర్తీకి ఇస్రో జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ISRO Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం పోస్టులు-86
    ఫిట్టర్- 20
    ఎలక్ట్రానిక్ మెకానిక్- 15
    ప్లంబర్- 2
    వెల్డర్- 1
    మెషినిస్ట్- 1
    డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్- 10
    డ్రాఫ్ట్స్‌మ్యాన్ ఎలక్ట్రికల్- 2
    టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్- 20
    టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్- 12
    టెక్నికల్ అసిస్టెంట్ సివిల్- 3

    ISRO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


    దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 24
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 13
    విద్యార్హత: ఐటీఐ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు
    వయస్సు: 18 నుంచి 40 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు.
    దరఖాస్తు ఫీజు: 250
    వేతనం: టెక్నీషియన్, డ్రాఫ్ట్‌మెన్‌కు నెలకు రూ.21,700+డీఏ, టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.44,900+డీఏ

    ISRO Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...


    ముందుగా ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ఓపెన్ చేయండి.
    పేజీ చివర 'careers' సెక్షన్ క్లిక్ చేయండి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కిందకు స్క్రోల్ చేస్తే Human Space Flight Center (HSFC) లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
    కొత్త పోజీలో 'apply online' పైన క్లిక్ చేయండి.
    ఆ తర్వాత పేజీలో మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్ పైన క్లిక్ చేయండి.
    ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి ఫోటోలు అప్‌లోడ్ చేసి పేమెంట్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Photos: రిలయెన్స్ ట్రెండ్స్‌ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి



    ఇవి కూడా చదవండి:

    Scholarship: ఏటా రూ.48,000 స్కాలర్‌షిప్... 1000 మంది స్టూడెంట్స్‌కి ఛాన్స్

    BECIL Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 3000 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు