HOME »NEWS »JOBS & EDUCATION »indian space research organisation isro invites applications for 55 posts apply before may 1 ss

ISRO Jobs: ఇస్రోలో 55 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

ISRO Jobs: ఇస్రోలో 55 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు
ISRO Jobs: ఇస్రోలో 55 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

ISRO Recruitment 2020 | ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టెక్నీషియన్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  • Share this:
    ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ఏప్రిల్ 3 వరకేనని నోటిఫికేషన్‌లో ప్రకటించింది ఇస్రో. కరోనా వైరస్ కారణంగా సంక్షోభం నెలకొనడంతో దరఖాస్తు గడువును 2020 మే 1 వరకు పొడిగించింది. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్-SAC కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది ఇస్రో. మొత్తం 55 సైంటిస్ట్ / ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టెక్నీషియన్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    ISRO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 55


    సైంటిస్ట్ / ఇంజనీర్- 21
    టెక్నికల్ అసిస్టెంట్- 6
    టెక్నీషియన్ బీ - 28 (ఫిట్టర్-6, మెషినిస్ట్-3, ఎలక్ట్రానిక్స్-10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, ప్లంబర్-1, కార్పెంటర్-1, ఎలక్ట్రీషియన్-1, మెకానికల్-3, కెమికల్-1)
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 14
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 1 సాయంత్రం 5 గంటలు
    విద్యార్హత- సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్సీ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. టెక్నీషియన్ బీ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ.
    వయస్సు- 2020 మార్చి 27 నాటికి 18 నుంచి 25 ఏళ్లు
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Job Readiness: గుడ్ న్యూస్... ఈ కోర్సు చేస్తే టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు

    SWAYAM: ఖాళీ టైమ్‌లో ఈ ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీగా చేయండి

    Work From Home: ఈ గ్యాడ్జెట్స్, యాప్స్ ఉంటే మీ ఇల్లే ఆఫీస్‌గా మారిపోతుంది
    Published by:Santhosh Kumar S
    First published:April 04, 2020, 15:26 IST

    टॉप स्टोरीज